Global Hospital
-
జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..?
సాక్షి, బంజారాహిల్స్: తాము కోరుకున్న విధంగా ఆస్తి పంపకాలు చేయకపోతే అంతం చేస్తామంటూ గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్, డైరెక్టర్ డా.కంచర్ల రవీంద్రనాథ్ను బెదిరించిన వ్యవహారంలో ఆయన అల్లుడు, వియ్యంకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో ఉంటున్న డా.రవీంద్రనాథ్‌కు ఇటీవల ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. తన ఆస్తుల్లో సుమారు 70 శాతం గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్‌కు ఇస్తానని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలనీలో నివసించే అల్లుడు పొట్లపల్లి సూరజ్‌తేజ్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ రవీంద్రనాథ్ ఇంటికి వచ్చాడు. రావడంతోనే ఇద్దరి మధ్య ఆస్తుల విషయమై గొడవ జరిగింది. తాము చెప్పినట్లు ఆస్తులను సమానంగా పంచకపోతే అంతు చూస్తానని, తన వద్ద లైసెన్స్డ్ గన్ కూడా ఉందని దానికి పని చెప్పమంటావా అంటూ బెదిరించాడు. చెన్నైలో ఉంటున్న తన కుమారుడి మామ(వియ్యంకుడు) పరుచూరి రాజారావుతో చేతులు కలిపిన అల్లుడు సూరజ్‌తేజ్ కొంత కాలంగా తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేసి తన కదలకలను గమనిస్తున్నాడని మూడో వ్యక్తికి తాను మాట్లాడుతున్న విషయాలను చేరవేస్తున్నారన్నాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డాక్టర్ రవీంద్రనాథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తన అడ్డు తొలగించుకునేందుకు అల్లుడు, వియ్యంకుడు కిరాయి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించాడు. మూడు నెలల్లోగా ఆస్తుల పంపకాలు చేయకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమని బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడు సూరజ్‌తేజ్, వియ్యంకుడు రాజారావులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చదవండి: బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరబాద్కూ ముప్పు! -
బాలుడికి అరుదైన శస్త్రచికిత్స
ఖైరతాబాద్: వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధితో మంచానికే పరిమితమైన ఓ బాలుడికి లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గురువారం ఆస్పత్రి వైద్యులు వివరా లు వెల్లడించారు. యమన్‌కు చెందిన రాగేష్ అబ్దుల్ సాగర్(11)పుట్టుకతోనే జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. గత నెల 16న అతడి తల్లిదండ్రులు బాలుడిని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరిశీలించిన డాక్టర్ వెంకట్ వేమూరి 17న అతడికి శస్త్రచికిత్స చేశారు. అతడి తొడలు, పిక్కల వద్ద ఎక్కువగా బోన్ బెండ్ ఉన్న దగ్గర ‘వి’ షేప్‌లో కట్ చేసి ఆ తరువాత బోన్‌ను సరిచేసి టెలిస్కోపిక్ నేల్ రాడ్లను ఫిక్స్ చేశారు. రాగేష్ తానంతట తాను నిలబడి నడవడానికి ఆరు నెలలు పడుతుందన్నారు. -
29 కిలోమీటర్లు...22 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ కేవలం 22 నిమిషాల్లో అదిగమించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిటీ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న డోనర్ తన గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతంలోని ఆస్పత్రికి చేరాల్సి ఉందని సమాచారం అందింది. ఆ ఆస్పత్రుల్లో దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన రోగి ఆపరేషన్ మొదలైంది. లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 12.37 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. దీనికి దాదాపు రెండు గంటల ముందు నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సైబరాబాద్ అధికారుల సాయం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఈ రూట్ రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూడటానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఓ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరిన ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి సరిగ్గా 12.59 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ ఆర్గాన్‌ను వైద్యులు తీసుకువెళ్లిపోయారు. -
దాడి చేసి తప్పించుకోవడం ఇక సులువు కాదు
సాక్షి, సిటీబ్యూరో: ఆస్పత్రులపై దాడి చేసిన వారు ఇకపై తప్పించుకోలేరు. క్షణికావేశానికి లోనై దాడులకు పాల్పడితే.. ఎంతటివారైనా ఇకపై కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వైద్యపరమైన నిర్లక్ష్యం, తప్పుడు వైద్యంతో రోగులు చనిపోతే వినియోగదారుల ఫోరం, పోలీసులను, కోర్టులను ఆశ్రయించాలే కానీ.. ఆగ్రహంతో వైద్యులపై దాడి చేయడం, ఆస్తుల విధ్వంసానికి పూనుకోవడం వల్ల రోగుల బంధువలే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ 2008 యాక్ట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. సంతోష్‌నగర్‌కు చెందిన షమీమ్‌బేగం (45) శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతుండగా, బంధువులు ఆమెను చికిత్స కోసం వారం రోజుల క్రితం లక్డికాపూల్‌లోని గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడం, సోమవారం రాత్రి ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడం, ఆగ్రహించిన మృతురాలి కుమారులు, ఇతర బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి, ఆస్తుల విధ్వంసానికి దిగడం, అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి యత్నించిడం, ఈ అంశాన్ని ఇరువర్గాలు సీరియస్‌గా తీసుకోవడం తెలిసిందే. చట్టం నుంచి తప్పించుకోలేరు.. ఇప్పటికే ఆసుపత్రి ముఖ్య భద్రతాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పో లీసులు మృతురాలి కుమారులు అహ్మద్ అలీ, బ ర్కత్ అలీ, ముస్తఫా అలీతో పాటు మరికొందరిపై 148, 324, 332, 353, 427, ఆర్/డబ్ల్యూ 149 ఐ పీసీతో పాటు ‘తెలంగాణ మెడికేర్ సర్వీస్ ప ర్సన్స్, ఇనిస్టిట్యూషన్స్ సెక్షన్ 4 ప్రకారం’ నాన్ బె యిలబుల్ కేసులను నమోదు చేశారు. తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్–2008ని తొలిసారిగా అమలు చేశారు. మృతురాలి తరపు బంధువులు దాడి చే సినట్లు నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్షతో పా టు ధ్వంసమైన ఆస్తులకు రెండింతలు చెల్లించా లని ఈ చట్టం చెబుతోంది. ఒక వేళ నష్ట పరిహారా న్ని చెల్లించేందుకు నిందితుల వద్ద డబ్బు లే కపోతే.. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అ మలు చేసి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అ వకాశం కూ డా ఉంది. ఇదిలా ఉంటే మృతురాలి తనయుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీను, డిజిటల్ వీడియో రికార్డింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నింధితులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన వైద్యులు .. రోగి తరపు బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంపై వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి ముందు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ‘సేవ్ డాక్టర్స్ సేవ్ లైఫ్స్’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని వివిధ ఆస్పత్రులకు చెందిన పలువురు వైద్యులు ఇందులో పాల్గొన్నారు. అభద్రతా భావానికి గురికావద్దు: ఏసీపీ వైద్యుల నిరసన విషయం తెలుసుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నింధితులపై ఇప్పటికే క్రైం నం 691/2018 అండర్ సెక్షన్ 178, 324, 332 పోలీసులను అడ్డుకోవడం, 427 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్, మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ వయోలెన్స్ ఆఫ్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ 2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాంమని తెలిపారు. డాక్టర్లు అభద్రతా భావానికి లోనుకావాల్సిన పనిలేదని ఏసీపీ తెలిపారు. వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు లక్టీకపూల్లోని గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిపై దాడి అత్యంత హేయమైన చర్య అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఎన్.రెడ్డి, డాక్టర్ సంపత్‌రావులతో కూడిన బృందం మాట్లాడింది. రోగి బంధువుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. దాడుల వల్ల వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వైద్యుడు కూడా రోగిని కాపాడేందుకే యత్నిస్తాడని, ఉద్దేశ పూర్వకంగా ఎవరూ రోగి మృతికి కారణం కారని స్పష్టం చేశారు. హెచ్1ఎన్1తో మృతి చెందిన షమీమ్‌బేగం(45) బంధువులు తొలుత ఏమాత్రం సహాకరించక పోయినా మానవతా ధృక్పథంతో వారు వైద్యసేవలు అందించారని, బాధితురాలిని కాపాడేందుకు వారు అన్ని ప్రయత్నాలు చేశారని, ఆరో గ్యపరిస్థితి విషమించి ఆకస్మిక గుండెపోటుతో ఆమె మృతి చెందింద న్నారు. ఈ సమయంలో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం కానీ, చికిత్సల్లో లోపాలు కానీ లేవని తమ పరిశీలనలోనూ తేలిందన్నారు. -
ఆస్పత్రిపై దాడి అమానుషం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడం అమానుషమని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. బీజేపీ నాయకులతో కలసి బుధవారం ఆయన గ్లోబల్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. సిబ్బంది, డాక్టర్లు, పోలీసులపై కూడా దౌర్జన్యం జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎంఐఎం మద్దతుతో గతంలో నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రులపై, జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడులు జరగడం బహిరంగ రహస్యమే అని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారిపై, దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ , బీజేపీ మీడియా కమిటీ కన్వీనర్ వి.సుధాకర్ శర్మ, బీజేపీ నగర కార్యదర్శి ఎన్.గౌతమ్ రావులు ఉన్నారు. -
గ్లోబల్ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించిన ఐఎంఏ
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఖండించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సోమజిగూడా ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైద్యం పట్ల ఎలాంటి అనుమానాలున్నా వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదా పోలీసులకైనా ఫిర్యాదు చేసే అవకాశం బాధితులకు ఉందని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన హింసాత్మక ఘటన సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం వల్లే అత్యవసర వైద్య చికిత్స అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసమే వైద్యులు ప్రయత్నం చేస్తారని, షేమిమ్ బేగంకు వెంటిలేటర్ పెట్టాలని వైద్యులు చెప్పినా కుటుంబ సభ్యులు సహకరించ లేదని చెప్పారు. ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.ప్రతాప్ రెడ్డి, రవీందర్ రావు, సంపత్ రావు, జీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు. -
గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల క్రితం తమపై జరిగిన దాడికి నిరసనగా డాక్టర్లు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై భైఠాయించిన డాక్టర్లు.. సేవ్ డాక్టర్స్, సేవ్ లైవ్స్, సేవ్ మెడికల్ ప్రొఫెసనల్స్, సేవ్ హాస్పిటల్ స్టాఫ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాలు ఇలా .. సంతోష్‌నగర్‌కు చెందిన షమీనా బేగం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్ అలీ ఖాన్, బర్కత్ అలీ ఖాన్, ముజఫర్ అలీ ఖాన్‌లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్ ట్రీట్మెంట్ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి నలుగురిపై సెక్షన్ 4.. హైదరాబాద్ : లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనపై సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ స్పందించారు. ఆస్పత్రిపై దాడి చేసిన నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా నలుగురిపై సెక్షన్ 4ను అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసులపై కూడా వారు దాడిచేసినట్లు వెల్లడించారు. ఐపీసీ 148, 324, 333, 427 రెడ్‌విత్ కింద కేసులు నమోదు చేశామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో హోంమంత్రిపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. అరెస్టయిన నలుగురిని న్యాయ స్థానం ముందు ప్రవేశ పెట్టి, రిమాండ్ చేస్తామని తెలిపారు. చదవండి : ‘గ్లోబల్ ఆస్పత్రి’ ఘటనపై రెండు కేసులు -
‘గ్లోబల్ ఆస్పత్రి’ ఘటనపై రెండు కేసులు
సాక్షి, సిటీబ్యూరో:లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి సంబంధించి ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేసినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఈ కేసులను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన షమీనా బేగం ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్ అలీ ఖాన్, బర్కత్ అలీ ఖాన్, ముజఫర్ అలీ ఖాన్‌లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్ ట్రీట్మెంట్ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు, ఆస్పత్రి భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినుద్దీన్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో వైద్యులు, ఆస్పత్రులపై దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన చట్టాన్ని తొలిసారి ప్రయోగించామని, దీని ప్రకారం ఆస్తినష్టాన్ని సైతం నిందితుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. -
గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం
-
గుండె చప్పుడు ఆగరాదని..
సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ మార్గంలో వాహనాల వేగం 20 కి.మీ మించదు. అలాంటిది మంగళవారం ఓ గుండె చప్పుడు ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానెల్’ ఇచ్చారు. దీంతో ఓ గుండె, ఊపిరితిత్తుల (లైవ్ ఆర్గాన్స్)ను గ్లోబల్ ఆస్పత్రి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య గల 29 కి.మీ దూరాన్ని అంబులెన్స్‌లో కేవలం 22 నిమిషాల్లో తరలించారు. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతో సాధ్యమైంది. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాల అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న ఓ జీవన్మృతుడి గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉంది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాలి. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో అంబులెన్స్ మధ్యాహ్నం 3.23 గంటలకు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రి నుంచి బయలుదేరుతుందని సెట్స్‌లో వినిపించిన సందేశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 3 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ‘సెంటర్’ నుంచి పర్యవేక్షణ డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరితిత్తులు గల బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కి.మీ. దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలోను పోలీస్ అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణించిన మార్గం ఇలా.. మధ్యాహ్నం 3.23 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి 3.45కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ చానల్’ ఇవ్వడంతో కేవలం 22 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్లే ఈ ‘ఆపరేషన్’ సాధ్యమైందని గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు లేఖ రాసింది. -
నిఖిల్ రెడ్డి కేసు..డాక్టర్‌పై రెండేళ్ల నిషేధం
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి ఎత్తు పెరగడం కోసం శస్త్ర చికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా..నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ చేశాడని, నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు, డాక్టర్ చంద్రభూషన్ నిర్లక్ష్యం ఉందని భావించి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఎస్ఎంసీ ఆయనపై రెండు సంవత్సరాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కేసుకు సంబంధించి కేపీహెచ్‌బీలోని శృతి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై కూడా టీఎస్ఎంసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. సరోగసీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలిసింది. -
నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమం
చెన్నై : శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్లోబల్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నటరాజన్ గత తొమ్మిది నెలలుగా గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు మూత్రపిండాలు, కాలేయం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం నటరాజన్‌ను వెంటీలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీర అవయవాలు పూర్తిగా పాడవటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై శశికళ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో నటరాజన్‌ను కలిసేందుకు శశికళ పేరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. -
7 నెలల తర్వాత నిఖిల్‌రెడ్డి నడిచాడు..
-
నిఖిల్‌రెడ్డి నడిచాడు..
హైదరాబాద్: అడుగులో అడుగు వేసుకుంటూ నిఖిల్‌రెడ్డి నడక నేర్చుకుంటున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేరుుంచుకున్న నిఖిల్ సుమారు 7 నెలల 22 రోజుల తర్వాత ఇప్పుడే లేచి నిలబడుతున్నాడు. మంగళవారం వాకర్ సాయంతో ఇంటిలో కొన్ని అడుగులు నడిచాడు. ‘చాలా రోజుల తర్వాత మా అబ్బారుు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. నొప్పిగా ఉన్నా కొన్ని అడుగులు వేశాడు. చాలా సంతోషంగా ఉంది’ అని నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వాకర్ సాయంతో అడుగులు వేస్తున్న నిఖిల్ రెడ్డి -
మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు
-
మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు
నిఖిల్‌రెడ్డి పరిస్థితిపై వైద్యబృందం సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు చికిత్స చేరుుంచుకున్న బాధితుడు నిఖిల్‌రెడ్డి రెండు కాళ్లలో అమర్చిన రాడ్లను తొలగించే అంశంపై మరో మూడు వారాల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(టిశా) ఏర్పాటు చేసిన ముగ్గురు నిపుణులతో కూడిన వైద్య బృందం స్పష్టం చేసింది. అప్పటి వరకు యధావిధి వైద్య సేవలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కాళ్లలో ఏర్పాటు చేసిన రాడ్లను వదులు చేసి, ఎలాంటి సమస్య లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాటిని తొలగిస్తామని పేర్కొంది. శనివారం గ్లోబల్ ఆస్పత్రికి వచ్చిన నిఖిల్‌రెడ్డిని వైద్య బృందం పరిశీలించింది. ఇదిలా ఉంటే అనైతిక చికిత్సలు చేసి తన కొడుకు కాళ్లు కోసిన వైద్యుడు చంద్రభూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోవర్థన్‌రెడ్డి.. నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిశారు. న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరలో సదరు వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. -
నిఖిల్‌రెడ్డికి చికిత్సలు కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పటి వరకు గాయం మానకపోగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం వైద్య సేవలను పునరుద్ధరించింది. చికిత్స అనైతికమని పేర్కొంటూ ఇప్పటి వరకు వైద్యసేవలు అందించిన డాక్టర్ చంద్రభూషణ్‌పై ఎంసీఐ ఇటీవల వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయంగా ఆయన స్థానంలో గ్లోబల్ యాజమాన్యం మరో ఇద్దరు (డాక్టర్ అరవింద్, డాక్టర్ అనంతపాయ్)వైద్యులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సదరు వైద్య బృందం సోమవారం నిఖిల్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. కట్లను విప్పేసి గాయాలను శుభ్రం చేసింది. ఇక నుంచి విధిగా వైద్యసేవలు అందించనున్నట్లు ప్రకటించింది. -
నిఖిల్ వైద్య సేవలపై గందరగోళం
-
ఇంకా మానని గాయం..
► నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలపై గందరగోళం ► ప్రభావం చూపుతున్న తెలంగాణ వైద్య మండలి తీర్పు ► ఆంక్షలతో వైద్యం చేయలేని స్థితిలో డాక్టర్ చంద్రభూషణ్ సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలు అందించే అంశంపై గందరగోళం నెలకొంది. తెలంగాణ వైద్య మండలి తీర్పు నేపథ్యంలో నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో నిఖిల్‌కు ఇకపై వైద్యసేవలు ఎవరు అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఒప్పందం మేరకు గాయం పూర్తిగా మానే వరకు శస్త్రచికిత్స చేసిన డాక్టరే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. అయితే తమకు కనీసం మాట కూడా చెప్పకుండా తమ కుమారునికి ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం అనైతికమని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఎంసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య మండలి చంద్రభూషణ్‌పై రెండేళ్లు వేటు వేసింది. తీర్పు నేపథ్యంలో ఆయన బాధితునికి వైద్యం చేయలేని స్థితి. ఆయన స్థానంలో ఎవరు వైద్యం అందిస్తారో కూడా ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో నిఖిల్‌కు వైద్యసేవలు అందించే అంశం ప్రశ్నార్థకమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: గ్లోబల్ యాజమాన్యం నిఖిల్‌కు వైద్యం చేసేందుకు ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఎంసీఐ ఆయనపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం బాధితుడు నడుస్తున్నాడు. మెట్లు కూడా ఎక్కి దిగుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. బాధితుడు నడవగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించాం. దానికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. బాధితునికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తాం. ఇప్పటికే ప్రత్యామ్నాయ వైద్యులను కూడా ఏర్పాటు చేశాం. గాయాన్ని శుభ్రం చేసి 11 రోజులైంది నిఖిల్‌కు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేసి ఎనిమిది మాసాలైంది. ఇంకా గాయం మానలేదు. లేచి నాలుగు అడుగులు వేస్తే కాళ్లు వాస్తున్నాయి. ఇప్పటికీ భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. మా అభ్యంతరం మేరకు ఎత్తు పెంపు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. కానీ రెండు కాళ్లకు వేసిన రాడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గాయం మానకపోవడంతో దానికి కట్టుకట్టారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు కట్లను విప్పి శుభ్రం చేయాల్సి ఉన్నా.. 11 రోజుల నుంచి ఎవరూ రాలేదు. ఆస్పత్రికి ఫో¯ŒS చేస్తే.. సరైన స్పందన రావడం లేదు. అదేమంటే డాక్టర్‌పై ఫిర్యాదు చేసి.. సస్పెండ్ చేయించారు కదా.. అంటూ వైద్య సేవల బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. – గోవర్ధన్ రెడ్డి, నిఖిల్ తండ్రి -
ఆలస్యమైనా మంచి నిర్ణయమే: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కిన డాక్టర్ చంద్రభూషణ్‌ను సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరించిన డాక్టర్, గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ కౌన్సిల్ సిఫారసు చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఆరు నెలలుగా నిఖిల్ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్‌పై ఉందన్నారు. డాక్టర్ చంద్రభూషణ్, సీఈవో శివాజీ చటోపాధ్యాయ, గ్లోబల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు
-
'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు
⇒ నిఖిల్‌కు శస్త్ర చికిత్స చేసిన చంద్రభూషణ్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్య ⇒ తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా శస్త్రచికిత్స చేసిన చంద్రభూషణ్ ⇒ డబ్బు కోసమే ఇలా చేసినట్లు ఆరోపణ.. ఇప్పటికీ నడవలేకపోతున్న నిఖిల్‌రెడ్డి ⇒ మరికొందరు వైద్యులపైనా చర్యలు తీసుకున్న మెడికల్ కౌన్సిల్ ⇒ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల సస్పెన్షన్ సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంచాలంటూ తమ దగ్గరికి వచ్చిన నిఖిల్‌రెడ్డి అనే యువకుడికి.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, వైద్య ప్రమాణాలకు విరుద్ధంగా శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రెండేళ్లపాటు ఎటువంటి వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఆయనతోపాటు వైద్యవృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన మరికొందరు వైద్యులపైనా మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. సరోగసీ విధానంలో అక్రమానికి పాల్పడిన సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. తప్పుడు విధానాలు అవలంబించిన సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌కు చెందిన డాక్టర్ హరికుమార్ రవ్వా, డాక్టర్ మినాజ్ జఫర్‌లపైనా చర్యలు తీసుకుంది. శుక్రవారం మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ సమావేశానికి వైద్య విద్య డెరైక్టర్ రమణి, కాళోజీ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. నరకం చవిచూసిన నిఖిల్ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22) సాఫ్ట్వేర్ ఇంజనీర్. తాను 5.7 అడుగుల ఎత్తున్నా కూడా మరింత పొడవు పెరగాలన్న కోరికతో.. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేస్తే ఎత్తు పెరగొచ్చని ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్ చెప్పడంతో.. శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. దీంతో నిఖిల్ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చంద్రభూషణ్ నేతృత్వంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే అప్పటికే ఇంట్లో చెప్పకుండా వెళ్లిన కుమారుడి పట్ల ఆందోళనకు గురైన నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకి గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. నిఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళన కూడా చేశారు. వైద్యుల తీరుపై అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండుకాళ్లకు శస్త్రచికిత్స చేయడంతో నెలల కొద్దీ నిఖిల్ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పటికీ మరొకరి సాయం లేకుండా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై నిఖిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపింది. చంద్రభూషణ్ నీతిబాహ్యమైన పద్ధతిలో వైద్యం చేసినట్లు గుర్తించి, రెండేళ్లపాటు వైద్య వృత్తి నుంచి బహిష్కరించింది. నిఖిల్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య నిపుణులను అతని వద్దకు పంపాలని నిర్ణయించింది. వైద్యురాలిపై ఐదేళ్ల సస్పెన్షన్ కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత మరో రకమైన తప్పుడు పనికి పాల్పడినట్లు మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. అమెరికాలో ఉంటున్న సుంకరి మన్మథకుమార్, చందన దంపతులు సంతానం కోసం నమ్రతను ఆశ్రయించారు. అద్దె గర్భం ద్వారా వారికి సంతానభాగ్యం కలిగించనున్నట్లు చెప్పిన నమ్రత... విశాఖపట్నం నుంచి ఒక సరోగసీ మదర్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. అయితే చందన నుంచి సేకరించిన అండానికి ఆమె భర్త వీర్య కణాలు కాకుండా... వేరే వ్యక్తికి చెందిన వీర్య కణాలతో ఫలదీకరణం చెందించి సరోగసీ మహిళ గర్భంలోకి పంపించారు. పాప పుట్టిన తరువాత అమెరికాకు తీసుకెళ్లే క్రమంలో పాస్‌పోర్టు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో ఆ దంపతులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ నమ్రత ఐదేళ్లపాటు ఎలాంటి వైద్యం చేయకుండా సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురిపై 6 నెలలు వేటు సెరెనిటీ ఫౌండేషన్ డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌లోని మైండ్క్రెస్ట్ ఆస్పత్రి వైద్యుడు హరికుమార్ రవ్వా, సమతా రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మినాజ్ జాఫర్లు మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఆ రంగంతో సంబంధం లేని నాన్ మెడికల్ సిబ్బంది ద్వారా మానసిక చికిత్సలు చేరుుంచినట్లు గుర్తించారు. దీనికి సంబందించి ఈ ముగ్గురిని ఆరు నెలల పాటు వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేశారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు జగిత్యాల సమీపంలోని ఓ గ్రామానికి చెందినవారు కడుపు నొప్పితో బాధపడుతూ డాక్టర్ టి.మనోజ్‌కుమార్‌ను ఆశ్రరుుంచారు. ఆయన వారితోపాటు సమీపంలోని మరో గ్రామానికి చెందిన కొందరికి అవసరం లేకపోరుునా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ నిర్ధారించింది. దీనికి సంబంధించి డాక్టర్ మనోజ్‌తో పాటు మరో ఏడుగురిపై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. ఇక ఎంబీబీఎస్ చదివి ఎండీగా సైన్ బోర్డు ఏర్పాటు చేసుకొన్న డాక్టర్ కృష్ణకాంత్రెడ్డిపై, ఆర్ఎంపీలుగా చలామణీ అవుతున్న కె.స్వామి, డి.రాజేశ్లపైనా చర్యలు తీసుకుంది. సీరియస్‌గా విచారణ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గత ఏప్రిల్ నుంచి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. దీనిపై 100 మందికి పైగా విచారించింది. నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల ఆవేదనను విన్నది. అనేక డాక్యుమెంట్లు సేకరించి, వైద్య వృత్తి నిబంధనలను అధ్యయనం చేసింది. ఆయా రంగాల్లో నిపుణులైన ఇతర వైద్యులనూ సంప్రదించింది. మన దేశంలో వ్యక్తుల సగటు ఎత్తు 5.5 అడుగులు. మరి నిఖిల్‌రెడ్డి 5.7 అడుగుల ఎత్తున్నాడు. అయినా ఆపరేషన్ ఎందుకు చేశారు, ఆరడుగులున్న వ్యక్తి వచ్చి మరో 4 అంగుళాలు పెంచమంటే పెంచుతారా అన్న వాదనలను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్ చేశాక నిఖిల్ నెలల కొద్దీ మంచంలోనే ఉండాల్సి వ స్తే ఎవరు బాగోగులు చూస్తారని కూడా ఆలోచించకపోవడాన్ని తప్పుబట్టింది. మొత్తంగా వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన డాక్టర్ల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైద్య వృత్తి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వైద్య విద్యా డెరైక్టర్ రమణి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కుమిలిపోతున్నా..: నిఖిల్‌రెడ్డి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం పట్ల బాధితుడు నిఖిల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనలా ఎవరూ మోసపోకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుందన్నారు. వైద్యులపై చర్యలు తీసుకుంటూ కౌన్సిల్ ప్రకటన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను నమ్మించి మోసం చేశారు. ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నాను. ఆ రోజు డాక్టర్లు చెప్పింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. ఆపరేషన్ తర్వాత మూడు నెలల్లో యధావిధిగా నడుస్తావని డాక్టర్లు చెప్పినందుకే తల్లిదండ్రులకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. డబ్బుల కోసమే ఇలా జరిగిందని ఊహించలేకపోయాను. ఇన్ని రోజులు కుమిలిపోతున్నా..’’ అని నిఖిల్‌రెడ్డి చెప్పారు. వైద్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పోరాడి.. వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్‌పై వేటు
-
నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్‌పై వేటు
హైదరాబాద్: సంచలనం కలిగించిన నిఖిల్ రెడ్డి ఆపరేషన్ కేసులో డాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్స్‌ను రెండేళ్ల పాటు రద్దు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు నెలల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నాడు. కాగా సర్జరీ విజయవంతం కాకపోగా, ఆ తర్వాత నిఖిల్ రెడ్డి నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. వైద్యుల నిర్వాకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, అతనికి పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు హెచ్ఆర్సీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆరు కేసుల్లో డాక్టర్లపై వేటు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఆరు వేర్వేరు కేసుల్లో డాక్టర్లపై వేటు వేసింది. కూకట్పల్లి సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రత లైసెన్స్‌ను ఐదేళ్లు రద్దు చేస్తూ, జీవితాంతం సరోగసీ వైద్యం చేయరాదని ఆదేశించింది. మరో మూడు కేసుల్లో డాక్టర్లు రాహుల్, మినహాజ్ జాఫర్,హరికుమార్ లైసెన్స్‌లను ఆరు నెలల చొప్పున సస్పెండ్ చేసింది. మరో కేసులో జగిత్యాల జిల్లా కత్లాపూర్కు చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ లైసెన్స్‌ను మూడు నెలలు రద్దు చేసింది. మరో ముగ్గురు డాక్టర్లు కృష్ణకాంత్ రెడ్డి, కే స్వామి, రాజేష్లపైనా చర్యలు తీసుకుంది. -
గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్ రద్దు చేయాలి
హెచ్చార్సీలో నిఖిల్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు హైదరాబాద్: గ్లోబల్ ఆసుపత్రి యాజమా న్యం తక్షణమే నిఖిల్ రెడ్డికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి ఎస్.గోవర్ధన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.రాజా గౌడ్‌తో కలసి బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లిన గోవర్ధన్ గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిఖిల్ రెడ్డికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డికి సర్జరీ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యవృత్తిలో కొనసాగకుండా నిషేధించాలని కోరారు. నిఖిల్ రెడ్డిని మోసం చేసిన ఆసుపత్రి సీఈవో శివాజీ ఛటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నిపుణులైన డాక్టర్లతో విచారణ జరిపించాలని అన్నారు. -
గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి
అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిఖిల్ రె డ్డి ఎత్తు పెంచే ఆపరేషన్ చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బుధవారం నిఖిల్ రెడ్డి తండ్రి బీజేపీ నాయకులతో కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. గ్లోబల్ ఆస్పత్రిలో అనైతిక పద్దతిలో ఎత్తు పెంచే సర్జరీ చేయడం వల్ల నిఖిల్ రెడ్డి అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నాడని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. -
నిఖిల్ కి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
♦ గ్లోబల్ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి ♦ సీఎస్ రాజీవ్ శర్మను కోరిన బీజేపీ ముఖ్య నేతలు సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంపు పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి కాళ్లకు అశాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను గురువారం సచివాలయంలో కలసి ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, ఎం.చంద్రయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. నిఖిల్‌రెడ్డికి చేసిన శస్త్రచికిత్స హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి అని, వైద్య ప్రయోగాల కోసం నిఖిల్‌రెడ్డిని పావుగా వాడుకున్నారని, నిఖిల్‌రెడ్డి ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రచారం కోసమే ఈ శస్త్రచికిత్స జరిపారని మండిపడ్డారు. వైద్యం పేరుతో ప్రజలను దోచుకోడానికి ఇలా కొత్త మార్గాన్ని కనుక్కున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా శస్త్రచికిత్స నిర్వహించడం అక్రమమన్నారు. వారం రోజుల్లోనే కోలుకుంటావని నిఖిల్‌రెడ్డికి వైద్యులు హామీ ఇచ్చారని, రెండు నెలలు గడుస్తున్నా అతను కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి సైతం నిఖిల్‌రెడ్డిని పరామార్శించడానికి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఈ ఘటనపై భారత వైద్య మండలి(ఎంసీఐ)కి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం నుంచి నిఖిల్‌రెడ్డికి రూ.కోటి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డిని మోసం చేసిన ఆస్పత్రి సీఈవో శివాజీ చటోపాధ్యాయ, వైద్యుడు చంద్రభూషణ్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి వ్యవహారంలో గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మను కోరారు. గురువారం సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి. కిషన్ రెడ్డిలతో పాటు నిఖిల్‌రెడ్డి తండ్రి రాజీవ్ శర్మను కలిశారు. నిఖిల్‌కి ఎత్తు పెంచుతామంటూ సర్జరీ పేరుతో గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్లు మోకాళ్లలో ఇనుప రాడ్లు వేసిన సంగతి తెల్సిందే. సర్జరీ విఫలమై నిఖిల్‌రెడ్డి ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు. -
ప్రయోగ వస్తువుగా వాడుకున్నారు: కిషన్ రెడ్డి
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
నమ్మి మోసపోయా...
- వారం రోజులన్నారు...రెండు నెలలైనా నడవలేకపోతున్నా - అంగుళం కూడా పెరగలేదు నిఖిల్‌రెడ్డి ఆవేదన సాక్షి, హైదరాబాద్: ‘డాక్టర్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయా. మూడు అంగుళాలు పెరుగుతావన్నారు. ఇప్పటివరకు అంగుళం కూడా పెరగలేదు. వారం రోజుల్లో స్వయంగా నడుస్తావని చెప్పారు. శస్త్రచికిత్స చేసి రెండు మాసాలు దాటింది. నడవడం కాదు కదా కనీసం లేచి నిలబడలేకపోతున్నా. నొప్పులకు నిద్ర కూడా పట్టడం లేదు. నరకయాతన అనుభవిస్తున్నా’ అని ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శనివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడాడు. ‘ఎత్తు పెంచుతామన్న వైద్యుల మాటలు నమ్మి మోసపోయా. శస్త్రచికిత్స గాయాలు ఇంకా మానలేదు. తరచూ ఇన్ఫెక్షన్ వస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తానే రెండు రోజులకోసారి ఇంటికి వచ్చి చికిత్స చేస్తానని డాక్టర్ చంద్రభూషణ్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను పట్టించు కోకుండా వదిలేశారు. కనీసం పది రోజులకోసారి కూడా రావడం లేదు. ఇకపై నాలాగా మరెవరూ మోసపోవద్దు. ఇంట్లో చెప్పకుండా శస్త్రచికిత్స చేయించుకుని నేను బాధపడటమే కాకుండా ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెడుతున్నా’ అని నిఖిల్ చెప్పాడు. గాయాలు పచ్చిగానే ఉన్నాయని, నొప్పులతో కుమారుడు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతున్నామని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చలు జరపడానికి వైద్యులు ఇంటికి వస్తామన్నారని, కానీ మీడియా కూడా వస్తుందని తెలియడంతో రాలేదని వెల్లడించారు. దీనిపై అన్నిరకాలా న్యాయపోరాటం చేస్తానన్నారు. 1.1 ఇంచులు పెరిగాడు... చికిత్స విజయవంతమైంది. శస్త్రచికిత్సకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం నిఖిల్ 1.1 ఇంచుల ఎత్తు పెరిగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఎందుకో తెలియదు కానీ... నిఖిల్ కుటుంబ సభ్యులు చికిత్స నిలిపివేయమంటున్నారు. వారి వాదనలను న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డు చేసి, ఆ తర్వాతే చికిత్స నిలిపివేస్తాం. ఆ తర్వాత వెయిట్ బేరింగ్ ప్రక్రియతో నడిచేలా చర్యలు తీసుకుంటాం. అతడిని పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నా. నిఖిల్ ఇంటికి కూడా వెళ్తున్నా. - డాక్టర్ చంద్రభూషణ్, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, గ్లోబల్ ఆస్పత్రి -
మాజీ ఎంపీ కల్పనాదేవి మృతి
వరంగల్ మాజీ ఎంపీ టి.కల్పనాదేవి గుండెపోటుతో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. హన్మకొండలో స్థిరపడిన కల్పనాదేవి 1983లోటీడీపీలో చేరారు. 1984లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి ఐదేళ్ల పాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హన్మకొండలో జయ ఆస్పత్రి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారు కూడా వైద్యులు. కాగా, కల్పనాదేవి మృతిపట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాపం వ్యక్తం చేశారు. -
మంచంపైనే నిఖిల్
ఆపరేషన్ జరిగి 50 రోజులైనా కదలలేని స్థితే హైదరాబాద్: నిఖిల్‌రెడ్డి... ఎత్తు పెరిగేందుకు నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న 22 ఏళ్ల యువకుడు ఇంకా మంచానికే పరిమితయ్యాడు. ఆపరేషన్ జరిగి యాభై రోజులయినా అడుగు కదపలేకపోతున్నాడు. జీడిమెట్లలోని మర్రి నారాయణరెడ్డినగర్లో నివసిస్తున్న నిఖిల్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వారం రోజుల్లో నడుస్తావని వైద్యులు చెప్పిన మాటలు అబద్ధాలని తేలింది. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ... నొప్పులు బాధిస్తూ... పెయిన్కిల్లర్లతో బతుకుతూ... వేరొకరు తోడుంటే గానీ నడవలేని దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ బాధ చూసి అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, మూడంగుళాల ఎత్తు పెరుగుతావంటూ నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఏప్రిల్ 5న శస్త్రచికిత్స చేశారు. రెండు రోజుల్లో లేచి తిరుగుతావని ఆపరేషన్ చేసిన వైద్యుడు చంద్రభూషణ్ నాడు చెప్పినా... నేటికీ మంచం దిగలేకపోతున్నాడు నిఖిల్. ‘డిశ్చార్జి అయిన తరువాత నుంచి రోజూ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేయిస్తామన్న వైద్యులు, వారానికోమారు వచ్చి వెళ్లిపోతున్నారు. పెయిన్‌కిల్లర్ మాత్రలు రోజూ వేసుకోమంటూ ఫోన్లోనే సలహా ఇచ్చి తప్పించుకొంటున్నారు’ అని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. తప్పు చేశా... ‘నేను తీసుకున్న నిర్ణయం తప్పు. నా వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. సర్జరీ జరిగి యాభై రోజులైనా కనీసం నిలబడలేకపోతున్నా. ఆపరేషన్ సమయంలో రోజుకు 1 ఎంఎం బోన్ పెరుగుతుందని వైద్యులు చెప్పిన మాటలన్నీ అబ ద్ధాలే. నాన్న సాయం లేనిదే ఏమీ చేయలేకపోతున్నా. ఆపరేషన్ చేసిన ప్రాంతమంతా దద్దుర్లు వచ్చి విపరీతమైన దురద పుడుతోంది. ఇన్ఫెక్షన్ అయి పుండ్లు వచ్చాయి. ఇన్ని రోజులు సెలవుల్లో ఉంటే తిరిగి జాబ్ ఇస్తారన్న గ్యారంటీ లేదు’ అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
నాన్నకు చెప్పకుండా తప్పు చేశా
‘సాక్షి’ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘మా ఇంజినీరింగ్ క్లాస్‌లో మొత్తం 30 మంది స్టూడెంట్స్. అందులో ముగ్గురమే 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండేటోళ్లం. అందుకే నేనూ మిగిలిన వాళ్లలా రెండు మూడు ఇంచ్‌లు పెరిగేందుకే శస్త్రచికిత్సతో సాహసం చేశా. ఈ చికిత్స విషయాన్ని నా తల్లితండ్రుల వద్ద దాచి తప్పే చేశా. అయితే డాక్టర్లు రెండు రోజుల్లో డిశ్చార్జి, వారం రోజుల్లో వాకర్ సహాయంతో నడవొచ్చని చెప్పారు. కానీ పది రోజులవుతున్నా కనీసం పూర్తిగా కూర్చోలేకపోతున్నా’ అంటూ ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేయించుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గ్లోబల్ ఆస్పత్రిలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు నిఖిల్ మాటల్లోనే... వారిలో ఒకడిగా... ఇంజనీరింగ్ క్లాస్మేట్సంతా నాకన్నా రెండు నుంచి మూడు ఇంచుల ఎత్తు పెరిగారు. నేను వారితో సమానంగా పెరగాలనుకున్నా. ఎత్తు పెరిగే వైద్యం కోసం ఆన్లైన్లో ఏడాది పాటు సెర్చ్ చేశా. చివరకు రష్యా, చైనాలో ‘ఇల్‌జర్వ్’ ప్రక్రియతో ఎత్తు పెంచే (లింబ్ లెంగ్తెనింగ్) ఆపరేషన్స్‌ను పరిశీలిం చా. ఆపై మిత్రులతో కలసి గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించా. గతంలో మేం ఎత్తు పెంచేం దుకు చేసిన శస్త్ర చికిత్సలు పూర్తి సక్సెస్ అయ్యాయని ఇక్కడి వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్సకు తొలుత రూ.2.5 లక్షలని చెప్పి.. చివరకు రూ.3 లక్షలు అన్నారు. 2.5-3 ఇంచుల ఎత్తు పెంచేందుకు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. నాలుగైదు మాసాల్లో పూర్తిగా కోలుకోవచ్చన్నారు. అదే ధీమాతో జనవరి 23 నా 22వ పుట్టినరోజు నాడు గ్లోబల్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించాను. అమ్మానాన్నకు చెబితే వద్దంటారనే... అమ్మానాన్నలకు చెబితే వద్దంటారనే వారికి చెప్పకుండా మిత్రులతో కలసి ఆస్పత్రిలో చేరా. నేను మేజర్ అవ్వడంతో అమ్మానాన్నలు ఎక్కడని ఆస్పత్రివారు అడగలేదు. నేను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని అమ్మకే ఇస్తుండేవాడిని. శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం రాత్రిళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్లు రూపొందించా. ఆ డబ్బుతోనే ఫీజు చెల్లించేశా. ఏప్రిల్ 5న ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికే పది రోజులవుతోంది. కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయి. మా అన్నయ్య ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. నేనూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలన్నదే లక్ష్యం. కాలేజీ రోజుల్లోనే నేను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడాలి. దేవుడు ఏం చేస్తాడో! ఇన్ఫెక్షన్... భయపెడుతోంది: తండ్రి గోవర్ధన్‌రెడ్డి ‘ఉగాది రోజునే మా వాడిని డిశ్చార్జి చేస్తామన్నారు. కానీ నిన్నటి నుంచి కాళ్లపై బొబ్బలు వచ్చాయి. విపరీతమైన మంటలు, నొప్పులు వస్తున్నాయి. కదల్లేకపోతున్నాడు. నా కుమారుడి విషయంలో పూర్తి అనైతికంగా వ్యవహరించిన వైద్యులు, ఆస్పత్రిపై కేసు పెట్టాం. త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేస్తాం. చిన్నప్పటి నుంచే... ఎంతో ప్రతిభ... టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన నిఖిల్ ఇంటర్, ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్ సాధించాడు. నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే నిఖిల్ రూపొందించిన ‘నోటీస్బోర్డ్’ కంప్యూటర్ అప్లికేషన్ ఎంతో పాపులర్ అయింది. సెయింట్‌మార్టిన్ సహా సీబీఐటీ సైతం నిఖిల్ రూపొందించిన అప్లికేషన్‌తోనే విద్యార్థుల హాజరు, ఫలితాల వివరాలను అనుసంధానం చేసేసింది. ఇవి కాకుండా తన సీనియర్స్, జూనియర్స్ కోసం సుమారు 16 అప్లికేషన్స్‌ను నిఖిల్ రూపొందించారు. -
నిఖిల్ బలమైన కోరికను కాదనలేకపోయా
సాక్షి, హైదరాబాద్: ‘ఎత్తు పెంపు శస్త్రచికిత్సలు సాధారణం. ఆత్మన్యూనతా భావానికి లోనై శస్త్రచికిత్స ద్వారా జీవితాన్ని మెరుగుపర్చుకోవాలని భావించే వారికి ఈ తరహా సర్జరీలు చేయడంలో తప్పులేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటిని చేస్తున్నారు. దేశంలోని షోలాపూర్, మిరాజ్‌లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటీవల గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డికి చేసిన ఎత్తు పెంపు శస్త్రచికిత్స సైంటిఫిక్ సర్జరీ. అంతకు మించి ఇది సేఫ్’ అని తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ గురువారెడ్డి, ఉస్మానియా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, స్పైన్ సర్జన్ డా క్టర్ జీవీ సుబ్బయ్య, గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ చంద్రభూషణ్ మాట్లాడారు. సంతకం చేసే దాకా కత్తిపట్టబోం ‘నిఖిల్ ఉదంతంపై మీడియా కథనాలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. నిఖిల్ ఉదంతం వైద్యులకు ఓ గుణపాఠం వంటిదే. ఇక నుంచి కాస్మొటిక్ సర్జరీల్లోనే కాదు ఏ శస్త్రచికిత్సకైనా సరే తల్లిదండ్రులు వచ్చి అంగీకారపత్రంపై సంతకం పెట్టే వరకూ కత్తిపట్టబోం. సైన్స్‌కు ఎమోషన్‌ను ముడిపెట్టి కథనాలు రాయడం బాధాకరం. కాస్మొటిక్ సర్జరీ చేయించుకునే వ్యక్తి మేజరైనప్పుడు తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తు పెంపు శస్త్రచికిత్సను కోర్టులే కాదు ఇప్పటి వరకు ఎవరూ తప్పుపట్టలేదు’ అని గురువారెడ్డి స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసినా ఏమీ జరుగదు.. ‘ఆరోగ్య మంత్రి, కోర్టులు, ఎంసీఐ వివరణ అడిగినా ఏమీ జరగదు. ఈ విషయంలో అన్నీ నైతికంగానే జరిగాయి. బాధితుడికి ఆరు మాసాల నుంచే కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎంత చెప్పినా వినలేదు. హైట్ పెంచాల్సిందేనని వేడుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత తలెత్తే సమస్యలను వైద్యులు ముందే వివరించారు. అంతా అనుకుంటున్నట్లు ఇది క్లిష్టమైన ప్రక్రియ కాదు. చాలా సులభమైంది. మహారాష్ట్రలోని మిరాజ్లోనే రోజుకు 20 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇదేదో రాత్రికి రాత్రి మభ్యపెట్టి చేసిన శస్త్రచికిత్స కాదు. నిఖిల్ నొప్పి తగ్గిన తర్వాత వాకర్ సాయంతో నడుస్తాడు. ఇందుకు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుంది. మరో ఎనిమిది మాసాల్లో రెండు అంగుళాల పొడవు పెరుగుతాడు. అందరిలాగే నిఖిల్ సాధారణ జీవితం గడుపుతాడు’ అని గురువారెడ్డి చెప్పారు. బలమైన కోరికను కాదనలేకపోయా ‘తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా నిఖిల్‌కు సూచించా. కానీ వారు అందుబాటులో లేరని చెప్పాడు. అతను మేజర్.. పైగా ఉద్యోగి కావడంతో ఎటువంటి అనుమానం రాలేదు. నిఖిల్ నా వద్దకు వచ్చిన ప్రతిసారి తిప్పిపంపాను. ఆరు మాసాల్లో ఐదారుసార్లు ఇలా చేశాను. అయినా వినిపించుకోలేదు. శస్త్రచికిత్స చేయించుకోవాలన్న అతని బలమైన కోరిక, ఎత్తుపెంపు పట్ల ఆయనకున్న ఫీలింగ్‌ను కాదనలేకపోయాను. ఈ శస్త్రచికిత్సలో విశేష అనుభవం ఉండటం, చికిత్స సులభమైనది కావడం, ఎత్తు పెంపు శస్త్రచికిత్సలను తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే శస్త్ర చికిత్సకు పూనుకున్నా’ అని గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ చీఫ్ చంద్రభూషణ్ స్పష్టం చేశారు. -
'నిఖిల్ భవిష్యత్ కు ఢోకా లేదు'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి అనే యువకుడికి నిర్వహించిన ఎత్తు పెంపు ఆపరేషన్ కు అనుసరించిన విధానం సరైందేనని ప్రముఖ వైద్యులు తెలిపారు. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వైద్యులంతా కలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిఖిల్ రెడ్డికి అందించిన చికిత్సలో గానీ, అనుసరించిన విధానంలో గానీ ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేశారు. అతడి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే వివాదం తలెత్తిందని అన్నారు. తల్లిదండ్రుల ఆవేదన కారణంగానే ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. వైద్యులు, రోగులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా సహకారంతో హైదరాబాద్ లో ఆరోగ్య రంగం ఎదిగిందని తెలిపారు. నిఖిల్ రెడ్డి విషయంలో శాస్త్రసాంకేతిక అంశాలను హైలెట్ చేయాలని కోరారు. అతడికి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రావని డాక్టర్లు హామీయిచ్చారు. ఎత్తు పెరగడానికి చేసిన ఆపరేషన్ అనైతికం కాదని అన్నారు. గురువారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రభూషణ్, ప్రసాద్ తదితర వైద్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిఖిల్ తల్లిదండ్రులకు తెలియకుండా అతడికి లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తు పెంపు ఆపరేషన్ చేయడంతో వివాదం తలెత్తింది. -
‘హైట్’ను సొమ్ము చేసుకున్న హైటెక్ ఆస్పత్రి
3 రోజుల క్రితం కనిపించకుండాపోయిన నిఖిల్... కాళ్లకు సర్జరీతో ఎత్తు పెంచుకునేందుకు గ్లోబల్ ఆస్పత్రిలో చేరిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆరు నెలలు బెడ్‌రెస్ట్, మూడు నెలలు వీల్‌చైర్‌పై ఉండాల్సిన పరిస్థితి ఆస్పత్రి నిర్వాకంపై తల్లిదండ్రుల ఆందోళన ఇలాంటి శస్త్రచికిత్సలు ప్రమాదకరమంటున్న వైద్యులు హైదరాబాద్: పొడవు పెరగాలనే ఆరాటం.. అందుకోసం కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయం.. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనన్న ఆందోళన.. వెరసి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వచ్చేసి, ఆపరేషన్ చేయించుకున్న ఓ యువకుడి ఉదంతం సంచలనం రేపింది. అసలు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే... రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేసిన నగరంలోని గ్లోబల్ ఆస్పత్రి నిర్వాకం వివాదాస్పదంగా మారింది. ఎత్తు పెరగడం మాటేమోగానీ... ఆ యువకుడు ఆరు నెలలపాటు బెడ్‌పైనే, మరో మూడు నెలలు చక్రాల కుర్చీలోనే ఉండాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఆవేదన నింపుతోంది. తొలుత మిస్సింగ్.. ఆపై సర్జరీ.. బోయిన్‌పల్లిలో నివాసముండే వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22). బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్‌కు ఇంకా ఎత్తుగా ఉండాలని బలమైన కోరిక. దీంతో కాళ్ల పొడవు పెంచే శస్త్రచికిత్స కోసం కొంత కాలంగా గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు చంద్రభూషణ్నుసంప్రదిస్తున్నాడు. చివరికి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు ‘లింబ్ లెన్త్ నీ విత్ లింబ్ రీ కనస్ట్రక్షన్ (మోకాలు, కింద ఎముక పునర్నిర్మాణం)’ శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్దమయ్యాడు. ఇందులో మోకాలు వద్ద నుంచి కాలు కింది ఎముకలోకి ఇంప్లాంట్లను పంపి.. కాలు పొడవు దాదాపు మూడు అంగుళాలు పెరిగేలా చేస్తారు. అయితే ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్న విషయం నిఖిల్ తమ కుటుంబసభ్యులకు చెప్పలేదు. ఆదివారం(ఈనెల 3న) అర్ధరాత్రి ఇంట్లోంచి వచ్చేసి, సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరాడు. తమ కుమారుడికోసం గాలించిన తల్లిదండ్రులు.. సోమవారం పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రోహిత్ సంతకం తీసుకుని శస్త్రచికిత్స ప్రారంభించారు. అయితే బంధువులు నిఖిల్ సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గాలించి.. అతను గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా చేస్తారా..? తాము గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లేలోగా అప్పటికే నిఖిల్‌కు శస్త్రచికిత్స జరుగుతోందని.. అతడిని కలవాలని ఎంత ప్రాధేయపడ్డా అవకాశం ఇవ్వలేదని నిఖిల్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అసలు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇదేమని అడిగితే చెప్పాల్సిన అవసరం లేదంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. తమ కుమారుడు నరకయాతన అనుభవిస్తున్నాడని.. ఆరు నెలలు బెడ్రెస్ట్తో పాటు మూడు నెలలు వీల్‌చైర్‌పై తిరగాల్సి ఉంటుందని వైద్యులే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసమే తమ కుమారుడికి ఆపరేషన్ చేశారని ఆరోపించారు. రోగి అనుమతితోనే ఆపరేషన్ చేశాం ‘‘నిఖిల్ ఏడాది కాలంగా మా ఆస్పత్రిని సంప్రదిస్తున్నారు. ఆయన మేజర్ కావడంతో ఆయన అనుమతితోనే ఆపరేషన్ చేశాం. మెడికో లీగల్ కేసు కాదు కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం రోగి మేజర్ అయితే వారి అనుమతితోనే శస్త్రచికిత్స చేయవచ్చు. మేం నిఖిల్‌ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకురాలేదు. ఆయన శస్త్రచికిత్స విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పకపోతే ఆ తప్పు మాది కాదు..’’ - గ్లోబల్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శివాజీ చటోపాధ్యాయ ఇలాంటి సర్జరీలతో ప్రమాదమే.. ‘‘సాధారణంగా ప్రమాదాలు జరిగినపుడు ఎముకలు విరిగిన పేషెంట్లకు మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తారు. కానీ క్రమంగా ఎత్తు పెంచేందుకు ఇలాంటి సర్జరీలు చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేందుకు 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు ఇవి విఫలమై ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, చీము పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాళ్లను పొడవు పెంచితే పొట్ట, చేతులు చిన్నవిగా కనిపించి, అందవిహీనంగా కనిపిస్తారు. మూడు నుంచి నాలుగు అంగుళాల ఎత్తు పెంచే ఇలాంటి సర్జరీలు చట్టరీత్యా తప్పుకాదు. కానీ ప్రమాదం ఎక్కువ..’’ - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ మాజీ డెరైక్టర్ -
రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు
హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. చర్లపల్లి జైలు నుంచి ఓ నిందితుడిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కోర్టుకు కారులో తరలిస్తుండగా పోలీసు వాహనం ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఇందులో రవి, క్రిష్ణ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఎల్బీనగర్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మత్తు మందిచ్చి నిలువు దోపిడీ
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు తెగబడ్డారు. ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణికులకు మత్తు మందిచ్చి సొత్తు దోచుకెళ్లారు. వారిచ్చిన శీతల పానీయాలు స్వీకరించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎ.సర్కార్(65), ఎస్.సర్కార్(58), ఎస్.సర్కార్(26)లు గోదావరి ఎక్స్‌ప్రెస్ హెచ్1 ఏసీ కోచ్‌లోని 15, 16, 17 బెర్త్‌ల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు మహిళ. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అపరిచితులు బాదం పాలలో మత్తు మందు కలిపి ముగ్గురికీ ఇచ్చారు. కొంతసేపటికీ ముగ్గురూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దీంతో దొంగలు వారి వద్దనున్న సొత్తు దోచుకెళ్లారు. గురువారం ఉదయం రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అపస్మారక స్థితిలో ఉన్నవారిని గమనించిన పోలీసులు గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఏపీ, తెలంగాణాల్లో విహార యాత్రకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఉన్న వీడియో కెమెరా, సెల్‌ఫోన్, ఆపిల్ ఐ ప్యాడ్, రూ.4,630 నగదు, లగేజీని రైల్వే స్వాధీనం చేసుకున్నారు. హెచ్1 బోగీని ఇన్స్పెక్టర్ రంగయ్య బృందం పరిశీలించింది. సంఘటనా స్థలంలో బాదం పాల బాటిల్స్ సేకరించారు. బోగీ ఏసీ మెకానిక్ వెంకటేశ్వర్లును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులు మాట్లాడే స్థితిలో లేరని, కోలుకోగానే పూర్తి వివరాలను రాబడతామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
-
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై కోలుకున్న ప్రత్యూషను బుధవారం గ్లోబల్ అవేర్ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బీఎస్సీ నర్సింగ్ చదవాలని ఉందని, బంధువులెవరి దగ్గర ఉండటం ఇష్టం లేదని, నాన్న, పిన్నిని కఠినంగా శిక్షించాలని కోర్టును కోరతానని తెలిపింది. హాస్టల్ లో ఉండి చదువుకుంటానని ప్రత్యూష తెలిపింది. కాగా ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్‌కు తీసుకురావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ చేపట్టింది. -
ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్ హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రంగా గాయపడి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారని, ఇప్పటి వరకు రూ.1.75 లక్షలు విరాళంగా వచ్చాయని వెల్లడించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యూషకు ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు ప్రకటిస్తూనే.. దాతల ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కింద సొంత ఎకౌంట్లో జమ చేసుకుంటోందని ఆరోపించింది. రూ.1.22 లక్షలు వైద్య ఖర్చుల కింద చూపుతూ, రూ.55 వేలు మాత్రమే బ్యాలెన్స్ చూపిస్తోందని ఆరోపించింది. దాతల నుంచి అందిన ఆర్థిక సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. కాగా, ఆస్పత్రిలో ప్రత్యూషకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ స్థానంలో తల్లిలా ఆదరించే మహిళా పోలీసులను రక్షణగా ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు పేరు చెప్పి బాలల హక్కుల సంఘం ప్రతినిధులు.. ప్రత్యూషను కలవకుండా అడ్డుకుంటున్న ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిశ్చార్జ్ సమయంలో తిరిగి ఇస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్, గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ ప్రత్యూష వైద్యానికి దాతలు అందించిన డబ్బులను ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఖర్చులకు వాడుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. ఆమెకు ఉచితంగా వైద్యం చేస్తున్నామని, ఇప్పటికే ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపామన్నారు. ప్రత్యూష డిశ్చార్జైన సమయంలో అధికారుల సమక్షంలో డబ్బులను తిరిగి ఇచ్చివేస్తామని తెలిపారు. -
ప్రత్యూషకు కేసీఆర్ దంపతుల పరామర్శ
-
ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు: ప్రత్యూష
-
నల్లగొండలో ఉచిత వైద్యశిబిరం
నల్లగొండ: గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ప్రత్యూషను అన్నివిధాల ఆదుకుంటాం
-
చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్.
-
ఖలేజా ఆపరేషన్
శస్త్రచికిత్స జరిగిన నాలుగు వారాల తర్వాత లక్ష్మయ్యతో గ్లోబల్ హాస్పిటల్ కాలేయ శస్త్రచికిత్స విభాగపు అధిపతి, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ టామ్ చెరియన్ కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. మెడికల్ వండర్ ఒక రోజు లక్ష్మయ్య హాస్పిటల్‌కు వెళ్లాడు. వయసు 60 ఏళ్లు. మహబూబ్‌నగర్ జిల్లా. ఆయన కళ్లు పచ్చగా ఉన్నాయి. జ్వరం ఉంది. రెండు నెలలలో నాలుగైదు కిలోల బరువు తగ్గాడు. అంతకుమించి వేరే లక్షణాలేమీ లేవు. ఆయన పొగతాగడు. మద్యం అలవాటు లేదు. పొట్ట పలుచగా ఉంది. పై నుంచి చూస్తే అంతా మామూలే. కానీ, సీటీ స్కాన్ తీస్తే... ఆశ్చర్యం... ఆయన ‘హైలార్ కొలాంజియో కార్సినోమా’ లేదా ‘బైల్ డక్ట్ మ్యాలిగ్నెన్సీ’ వ్యాధితో బాధపడుతున్నాడు. అది తీవ్రమైనదిగా పరిగణించే క్యాన్సర్లలో ఒకటి! కాలేయానికి రెండు తమ్మెలుంటాయి. ఎడమ వైపు తమ్మె నుంచి రక్తం తీసుకుపోవడానికి ‘లెఫ్ట్ పోర్టల్ వీన్’ రక్తనాళం ఉంటుంది. కుడి తమ్మెకు రక్తం అందించేందుకు ‘రైట్ హెపాటిక్ ఆర్టరీ’ రక్తనాళం ఉంటుంది. కాలేయం చూడటానికి ఎర్రగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా? అది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. కీలకమైన కార్యాలు నెరవేరుస్తుంటుంది. అత్యంత ప్రాధాన్యంతో దానికి ఎక్కువమొత్తంలో రక్తసరఫరా అవుతుంటుంది. అందువల్లే ఎర్రగా కనిపిస్తుంది. అది కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ... కొన ఊపిరి దొరికే వరకూ లక్షణాలను కనిపించనివ్వదు. అందుకే తీవ్రమైన క్యాన్సర్‌కు గురైనా లక్ష్మయ్యలో లక్షణాలేవీ బయటపడలేదు. కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. కొంతమేర తొలగించే అవకాశం ఇక్కడ లేదు. కానీ కాలేయం లేదంటే ప్రాణమే లేదని అర్థం. మరి పూర్తిగా తొలగించాలంటే కాలేయాన్ని ఇచ్చే దాత ఉండాలి. దాత దొరకడం, ఆయన ఇచ్చిన కాలేయం సరిపోలడం, దీనికి పెద్దమొత్తంలో అయ్యే ఖర్చు... అన్నీ సవాళ్లే! ఏం చేద్దామిప్పుడు? డాక్టర్ల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ టామ్ చెరియన్ ఒక ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, ఎడమవైపు రోగగ్రస్థమైన కాలేయపు తమ్మెను తొలగించాలి. అయితే, కుడిైవైపున రోగగ్రస్థం కాని తమ్మెను అలాగే ఉంచాలి. కానీ పాడైన రక్తనాళాలను మాత్రం తొలగించాలి. మరి ఆ భాగానికి రక్తసరఫరా కావాలి కదా! అందుకోసం ఇతర ప్రాంతాలనుంచి ఆరోగ్యకరమైన రక్తనాళాలను తెచ్చి, తొలగించినవాటి స్థానంలో అమర్చాలి. మరి రక్తనాళాలు దొరకవు కదా! అంటే, కుడివైపు తమ్మెకు పాత రక్తనాళాలతోనే మంచి రక్తం అందాలి. సంక్లిష్ట ఆపరేషన్ అనుకున్నంత సులభం కాదు. అయినా సాధ్యంచేశారు. ఎడమవైపున ఎనిమిది సెంటీమీటర్ల కాలేయపు తమ్మెను తొలగించారు. ఇటు రోగగ్రస్థమైన రక్తనాళాలనూ తొలగించారు. అటు వైపున ఆరోగ్యకరమైన రక్తనాళాలున్నాయి కదా! వాటిని తొలగించకుండా ఉంచిన ‘ఆరోగ్యకరమైన కాలేయపు తమ్మె’కు రక్తం అందేలా అనుసంధానించారు. ఇంతటి సంక్లిష్టమైన ఆపరేషన్‌కు తొమ్మిది గంటలు పట్టింది. రోగిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. తొలిదశలో కొద్దిరోజులు రక్తసరఫరాను యంత్రాల సహాయంతో చేశారు. ఆ తర్వాత అతడికి అమర్చిన వైద్య పరికరాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వచ్చారు. ఎట్టకేలకు కాలేయం ఇచ్చే దాత లేకుండానే, కొత్త కాలేయం అమర్చకుండానే, కొత్తదాన్ని అమర్చినంత పనిచేశారు. ఇక్కడ ఒక అంశం స్పష్టం చేయాలి. వైద్యుల నైపుణ్యం, సృజనతో కాలేయ మార్పిడి చేయకుండానే, చేసినప్పటి సాఫల్యాన్ని సాధించారన్నమాట! మనం భిన్న అర్థంలో వాడే ఖలేజా అనే మాటకు కాలేయం అని కూడా అర్థం. అలా ఇది ఖలేజా ఉన్న వైద్యుల వాస్తవగాథ! - యాసీన్ -
మేనులో వణుకు
మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అవయవం ఏదంటే మెదడు. శరీరంలో ప్రతి కదలిక కూ మస్తిష్కం నుంచి వచ్చే సంకేతాలే కారణం. మరి ఇంతటి ముఖ్యమైన మెదడులో అనుకోకుండా జరిగే మార్పులు.. శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మెదడులోని ‘బేసల్ గాంగ్లియా’ అనే ప్రదేశంలో జరిగే మార్పులతో ‘పార్కిన్సన్’ వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంది. మెదడులో డోపమిన్ అనే రసాయనాన్ని తయారు చేసే కణాలకు సంబంధించిన నరాలు ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి సోకిన వారిలో ఈ కణాలు వేగంగా చనిపోతుంటాయి. దీంతో డోపమిన్ రసాయనం తగ్గుతుంది. దీనివల్ల శరీరం బిగుతుగా అయిపోయి, చేతులు, కాళ్లు, వేళ్లు వణుకుతుంటాయని చెబుతున్నారు పార్కిన్సన్ వ్యాధి శస్త్రచికిత్స నిపుణుడు గ్లోబల్ హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డా॥ఎ.ప్రవీణ్. ఇటీవల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ఇలా వివరించారు. లక్షణాలు.. ► డోపమిన్ అనే రసాయనం తగ్గేకొద్దీ పార్కిన్సన్ లక్షణాలు పెరుగుతుంటాయి ► గతంలో జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుండేది. ఇప్పుడు సాధారణంగా కూడా వస్తోంది ► చేతులు, తల వణుకుతుంటాయి. ► జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకడం మొదలవుతుంది ► శరీరం బిగుతుగా అయిపోతుంది. దీనినే రిజిడిటీ అని అంటారు ► ఆలోచనలు మందగిస్తాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ► తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. ► నిద్రలో మాట్లాడటం, నిద్రలో నడవడం, పక్కవారిని కొట్టడం వంటివి కూడా జరగొచ్చు. డీబీఎస్‌తో మామూలు స్థితికి ఈ జబ్బు ఎలా వస్తుందో ఇప్పటికీ పూర్తి కారణాలు తెలియవు. ► కాబట్టి ఈ వ్యాధిని నియంత్రించడం ఒక్కటే మార్గమని చెప్పుకోవాలి ► 10 నుంచి 15 శాతం రోగుల కుటుంబాల్లో గతంలో ఎవరో ఈ వ్యాధి బాధితులే అయి ఉండవచ్చు ► పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులను డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిములేషన్) శస్త్ర చికిత్స ద్వారా మామూలు మనిషిని చేయవచ్చు ► డీబీఎస్ సర్జరీ ద్వారా రోగి మెలకువగా ఉండగానే మెదడులోకి రెండు లీడ్స్‌ని పంపించి, ఛాతీ దగ్గర చర్మం కింద ఒక బ్యాటరీని అమర్చుతారు ► ఈ బ్యాటరీ పదేళ్ల వరకూ పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్ ద్వారా బ్యాటరీ నుంచి విడుదలయ్యే కరెంట్‌ను నియంత్రిస్తారు. -
చెన్నై గుండె ఆపరేషన్ వైద్య బృందంలో
బళ్లారి టౌన్ : భారత వైద్య చరిత్రలోనే చెన్నై బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అరుదైన గుండె ఆపరేషన్ వైద్య బృందంలో బళ్లారి మెడికల్ కళాశాలలో చదివిన డాక్టర్ సురేష్ రావు పాల్గొనడం బళ్లారి జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం. 1993లో బళ్లారి మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన సురేష్‌రావు గుండె ఆపరేషన్‌లో పాలు పంచుకోవడం తమకు ఎంతో గర్వకారణమని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యాధర్ కిన్నాళ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీ.యోగానందరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వారు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గురైన ఓ మహిళ గుండెను తీసి బెంగళూరు నుంచి విమానంలో చెన్నైకి తీసుకెళ్లి అతి తక్కువ వ్యవధిలోనే మరొకరికి ఆపరేషన్ చేసి పెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన సురేష్‌రావు బళ్లారి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు తాము ఎంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
నేటి బాలలే..రేపటి బాధితులు
చిన్నారులపై బ్యాగుల బండ అధిక బరువుతో వెన్ను సమస్యలు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు ఖైరతాబాద్,న్యూస్‌లైన్: నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరికీ తెలుసు.. కానీ నేటి బాలలే రేపటి బాధితులన్నది ఇప్పటి సత్యం. పట్టుమని ఐదేళ్లు కూడా నిండకముందే చిన్నారులు బస్తాల్లాంటి బ్యాగులను మోసుకెళ్తుండడంతో చిన్నప్పటినుంచే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న వయస్సులోనే వారి శరీర బరువులో సగానికి పైగా బరువును పుస్తకాల రూపంలో మోయాల్సి వస్తోంది. దీంతో ఎదిగే పిల్లల్లో వెన్నుపై భారంతో 14 ఏళ్లు వచ్చేసరికి అనేకరకాల సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణంగా విద్యార్థి బరువులో 15శాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూడదు. వెన్నుపూస నిర్మాణం, అధిక బరువు మోయడం వల్ల వచ్చే ఇబ్బందులను గ్లోబల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రభూషణ్ తెలిపిన ప్రకారం.. అధిక భారంతో కలిగే ఇబ్బందులు.. చాలామంది పిల్లల్లో 15 సంవత్సరాల లోపే వారి శరీరంలో వివిధరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి వెంటనే డాక్టర్ సలహా మేరకు చికిత్స అందించాలి. పాఠశాల వయస్సులో మోయాల్సిన భారం కన్నా ఎక్కువ బరువు మోయడం వల్ల పార్శ్వగూని, స్కోలియోసిస్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పార్శ్వగూని సాధారణంగా 10 నుంచి 16 ఏళ్ల మధ్య వస్తుంది. బాలికలకు 10-14, బాలురకు 12-16 ఏళ్ల మధ్య రావొచ్చు. వెన్ను ఒకవైపుకు వంగిపోవడాన్ని స్కోలి యోసిస్ అంటారు. ఇలాంటి ఇబ్బందులను మొదటిదశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించాలి. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పిల్లలకు బ్యాగులు కొనేముందు పెద్దసైజు స్పోర్ట్స్ బ్యాగుల్లాంటివి కాకుండా పుస్తకాలకు సరిపోయేలా కొనుగోలు చేయాలి. బాలుడు/బాలిక బరువు 20కిలోలు ఉంటే..వారి బ్యాగ్ బరువు 3కిలోలకు మించకూడదు. ఒకవేళ ఎక్కువ పుస్తకాలుంటే టీచర్ సలహా మేరకు ఆరోజు కావాల్సిన పుస్తకాలను మాత్రమే బ్యాగులో తీసుకెళ్లాలి. బ్యాగ్‌ను రెండు భుజాలకు వేసుకోవాలి. ఒక భుజానికి వేసుకోవడం మంచిదికాదు. బ్యాగ్‌లో పుస్తకాల అమరిక చాలా ముఖ్యం. లావటి పుస్తకాలు వీపుకు ఆనుకునేలా.. ఆ తర్వాత లావు తక్కువున్న పుస్తకాలను అమర్చాలి. బ్యాగ్‌ను నడుంకింద వరకు వేలాడేలా ఉండకూడదు. వీటితోపాటు విద్యార్థులకు నిత్యం వ్యాయామం ఉండేలా చూడాలి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. -
ప్రభుత్వ లాంఛనాలతో విజయకృష్ణ అంత్యక్రియలు
తిరువూరు, న్యూస్‌లైన్ : చెన్నైలో మృతిచెందిన అస్సాంలోని భోజ్‌పూర్ డీఐజీ రామిశెట్టి విజయకృష్ణ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన తిరువూరులో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో శనివారం మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని అంబులెన్సులో తిరువూరు తీసుకొచ్చారు. రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడైన విజయకృష్ణ మృతదేహానికి జాతీయ పతాకం కప్పి, పూలమాలలు వేసి ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్మాన్సింగ్, అస్సాం అడిషనల్ డీఐజీ అనురాగ్ అగర్వాల్, ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు మహేష్లడ్డా, అజయ్‌కుమార్ విక్రమ్, చెన్నై మీడియా చీఫ్ మయూరీ సిన్హా, అడిషనల్ డీజీపీ చంద్రనాథ్, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు విజయకృష్ణ మృతదేహానికి తిరువూరు సమీపంలోని మామిడితోటలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. విజయకృష్ణ తండ్రి రామిశెట్టి శ్రీరాములు చితికి నిప్పంటించారు. పట్టణ ప్రధానవీధుల్లో ప్రత్యేక వాహనంపై ఉంచిన విజయకృష్ణ మృతదేహాన్ని అంతిమయాత్ర నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రిటైర్డు ఉద్యోగులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. శోకసంద్రమైన తిరువూరు... అందరికీ చిరపరిచితులైన రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడు, అస్సాం కేడర్ ఐపీఎస్ అధికారి రామిశెట్టి విజయకృష్ణ (43) మృతితో తిరువూరులో విషాదం అలుముకుంది. చెన్నై నుంచి విజయకృష్ణ మృతదేహాన్ని తిరువూరు తీసుకువస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న వెంటనే పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు ఆయన నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. విజయకృష్ణ భార్య లీలారాణి, కుమారులు శ్రీరాం, బలరాంతేజ్ను పోలీసు ఉన్నతాధికారులు ఓదార్చారు. -
కాలేయ కేన్సర్‌కు ల్యాప్రోస్కోపిక్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాలేయ కేన్సర్.. ఎంతోమంది దీనివల్ల మృత్యువాత పడ్డారు. దీని చికిత్స సైతం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు.. చికిత్సకోసం ఛాతీపై భారీగా కోతలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడీ పరిస్థితికి తెరపడింది. ల్యాప్రోస్కోపిక్ విధానంతో కాలేయంలోని కేన్సర్ గడ్డలను సులభంగా తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఛాతీపై భారీ కోతలకు స్వస్తి చెబుతూ కేవలం 2.5 సెంటీమీటర్ల రంధ్రంతోనే కాలేయంలోని కేన్సర్ గడ్డలను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు. గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు (57), ఒంగోలుకు చెందిన అబ్దుల్ రషీద్ (50) అనే రోగులకు ఈ విధానం ద్వారా ఇటీవల లివర్ కేన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేశారు. దీనిపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ కె.రవీంద్రనాథ్, ఇతర వైద్యులు మాట్లాడారు. ఈ విధానం వల్ల రోగి త్వరగా కోలుకోవడంతోపాటు వైద్యానికవుతున్న ఖర్చు కూడా తగ్గుతుందని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. లాప్రోస్కోప్లో కొత్తగా వచ్చిన 3డీ ైడెమైన్షన్ కెమెరా ద్వారా కేన్సర్ కణాలను సులభంగా గుర్తించడంతోపాటు వాటిని తొలగించే అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ చికిత్సను ప్రస్తుతం గ్లోబల్ అస్పత్రులలో మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ టాం చెరియన్ మాట్లాడుతూ.. 70 శాతం మంది వ్యాధి ముదిరాకే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్-బి, సి వైరస్ ఇన్ఫెక్షన్లతోపాటు మధుమేహం, అధిక బరువు కాలేయ కేన్సర్‌కు కారణమని తెలిపారు. హెపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్కపూర్ మాట్లాడుతూ దేశంలో ఏటా 50 వేలమంది కాలేయ కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు.