ప్రతికాత్మక చిత్రం
హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి ఎత్తు పెరగడం కోసం శస్త్ర చికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(టీఎస్‌ఎంసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా..నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ చేశాడని, నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు, డాక్టర్ చంద్రభూషన్ నిర్లక్ష్యం ఉందని భావించి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.
దీంతో టీఎస్‌ఎంసీ ఆయనపై రెండు సంవత్సరాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కేసుకు సంబంధించి కేపీహెచ్‌బీలోని శృతి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై కూడా టీఎస్‌ఎంసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. సరోగసీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment