ఆపరేషన్‌కు ముందు రాగేష్,ఆపరేషన్ అనంతరం
ఖైరతాబాద్: వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధితో మంచానికే పరిమితమైన ఓ బాలుడికి లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గురువారం ఆస్పత్రి వైద్యులు వివరా లు వెల్లడించారు. యమన్‌కు చెందిన రాగేష్ అబ్దుల్ సాగర్(11)పుట్టుకతోనే జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. గత నెల 16న అతడి తల్లిదండ్రులు బాలుడిని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరిశీలించిన డాక్టర్ వెంకట్ వేమూరి 17న అతడికి శస్త్రచికిత్స చేశారు. అతడి తొడలు, పిక్కల వద్ద ఎక్కువగా బోన్ బెండ్ ఉన్న దగ్గర ‘వి’ షేప్‌లో కట్ చేసి ఆ తరువాత బోన్‌ను సరిచేసి టెలిస్కోపిక్ నేల్ రాడ్‌లను ఫిక్స్ చేశారు. రాగేష్ తానంతట తాను నిలబడి నడవడానికి ఆరు నెలలు పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment