నిఖిల్‌రెడ్డికి చికిత్సలు కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పటి వరకు గాయం మానకపోగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం వైద్య సేవలను పునరుద్ధరించింది. చికిత్స అనైతికమని పేర్కొంటూ ఇప్పటి వరకు వైద్యసేవలు అందించిన డాక్టర్ చంద్రభూషణ్‌పై ఎంసీఐ ఇటీవల వేటు వేసిన విషయం తెలిసిందే.
ప్రత్యామ్నాయంగా ఆయన స్థానంలో గ్లోబల్ యాజమాన్యం మరో ఇద్దరు (డాక్టర్ అరవింద్, డాక్టర్ అనంతపాయ్)వైద్యులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సదరు వైద్య బృందం సోమవారం నిఖిల్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. కట్లను విప్పేసి గాయాలను శుభ్రం చేసింది. ఇక నుంచి విధిగా వైద్యసేవలు అందించనున్నట్లు ప్రకటించింది.