ఆలస్యమైనా మంచి నిర్ణయమే: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కిన డాక్టర్ చంద్రభూషణ్‌ను సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరించిన డాక్టర్, గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ కౌన్సిల్ సిఫారసు చేయకపోవడం సమంజసం కాదన్నారు.
ఆరు నెలలుగా నిఖిల్ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్‌పై ఉందన్నారు. డాక్టర్ చంద్రభూషణ్, సీఈవో శివాజీ చటోపాధ్యాయ, గ్లోబల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.