మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు
నిఖిల్‌రెడ్డి పరిస్థితిపై వైద్యబృందం
సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు చికిత్స చేరుుంచుకున్న బాధితుడు నిఖిల్‌రెడ్డి రెండు కాళ్లలో అమర్చిన రాడ్లను తొలగించే అంశంపై మరో మూడు వారాల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(టిశా) ఏర్పాటు చేసిన ముగ్గురు నిపుణులతో కూడిన వైద్య బృందం స్పష్టం చేసింది. అప్పటి వరకు యధావిధి వైద్య సేవలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కాళ్లలో ఏర్పాటు చేసిన రాడ్లను వదులు చేసి, ఎలాంటి సమస్య లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాటిని తొలగిస్తామని పేర్కొంది. శనివారం గ్లోబల్ ఆస్పత్రికి వచ్చిన నిఖిల్‌రెడ్డిని వైద్య బృందం పరిశీలించింది.
ఇదిలా ఉంటే అనైతిక చికిత్సలు చేసి తన కొడుకు కాళ్లు కోసిన వైద్యుడు చంద్రభూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోవర్థన్‌రెడ్డి.. నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిశారు. న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరలో సదరు వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.