అడుగులో అడుగు వేసుకుంటూ నిఖిల్‌రెడ్డి నడక నేర్చుకుంటున్నాడు.
హైదరాబాద్: అడుగులో అడుగు వేసుకుంటూ నిఖిల్‌రెడ్డి నడక నేర్చుకుంటున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేరుుంచుకున్న నిఖిల్ సుమారు 7 నెలల 22 రోజుల తర్వాత ఇప్పుడే లేచి నిలబడుతున్నాడు.
మంగళవారం వాకర్ సాయంతో ఇంటిలో కొన్ని అడుగులు నడిచాడు. ‘చాలా రోజుల తర్వాత మా అబ్బారుు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. నొప్పిగా ఉన్నా కొన్ని అడుగులు వేశాడు. చాలా సంతోషంగా ఉంది’ అని నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
వాకర్ సాయంతో అడుగులు వేస్తున్న నిఖిల్ రెడ్డి