walker
-
నటి నిమ్రత్ కాలికి గాయం..ఎయిర్‌పోర్ట్‌లో అలా కనిపించేసరికి..
Actress Nimrat Kaur Leg Injury: నటి నిమ్రత్ కౌర్ తాజాగా ఎయిర్‌పోర్టులో కాలికి గాయంతో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సహాయంతో ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో కాలికి ఏమైందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. వ్యాయామం చేస్తుండగా దెబ్బ తగిలిందని నిమ్రత్ పేర్కొంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటునట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిమ్రత్ త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ ప్రస్తుతం దస్వీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
కోడిపై కేసు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వాషింగ్టన్: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్న ఓ కోడిపై స్థానికులు వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్ పోలీసులు శుక్రవారం ఫేస్బుక్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాస్క్‌తో ఉన్న కోడి ఫొటోను పోస్టు చేస్తూ... ‘‘గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్ ఏటీవం వద్దకు వచ్చిపోయే వారిపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తోంది. అంతేగాక రోడ్డుపై సంచరిస్తూ వచ్చిపోయే కార్ల మీదకు ఎగురుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కోడిపై దర్యాప్తు చర్యలు చేపట్టాము. ఇక సదరు కోడి జాడ తెలిసిన వారు వెంటనే మాకు సమాచారం అందించండి’’ అంటూ పోస్టులో రాసుకుచ్చారు. కాగా ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇక ‘కోడిపై వింతగా పోలీసు కేసు ఏంటి నమ్మశక్యంగా లేదు ఇది నీజమేనా మీరే క్రియేట్ చేశారా? అంటూ కొంతమంది పోలీసులను ఎదురు ప్రశ్నిస్తుంటే.. ‘ఆశ్చర్యంగా ఉంది.. లవ్ దిస్!!!’ అంటూ ‘ఆ కోడి రోడ్డుపైకి ఎలా వచ్చింది.. అది రోడ్డు ఎలా దాటింది’ ‘వాల్కర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఆ కోడి రోడ్డు దాటిందేమో’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనిపై బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. కోడిపై సమాచారం అందించిన క్షణాల్లోనే పోలీసులు స్పందించారని చెప్పారు. అయితే పోలీసులు వచ్చేసరికి ఆ కోడి తప్పించుకుంది. ఇక ఆ కోడి నుంచి సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మళ్లీ అది కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. -
వేడుకకు వెళుతూ మృత్యుఒడిలోకి..
తేతలి (తణుకు) : తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేతలి గ్రామానికి చెందిన మానూరి ముత్యాలమ్మ (55) ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి అంబాజీపేట వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముత్యాలమ్మ సంఘటనా స్థలం లోనే మృతి చెందింది. దువ్వ గ్రామంలోని తన మనుమరాలు పుష్పవతి కావడంతో వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో నిండిపోయింది. సర్పంచ్ కోట నాగేశ్వరరావు మృతురాలి బంధువులను పరామర్శించారు. రూరల్ ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
7 నెలల తర్వాత నిఖిల్‌రెడ్డి నడిచాడు..
-
నిఖిల్‌రెడ్డి నడిచాడు..
హైదరాబాద్: అడుగులో అడుగు వేసుకుంటూ నిఖిల్‌రెడ్డి నడక నేర్చుకుంటున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేరుుంచుకున్న నిఖిల్ సుమారు 7 నెలల 22 రోజుల తర్వాత ఇప్పుడే లేచి నిలబడుతున్నాడు. మంగళవారం వాకర్ సాయంతో ఇంటిలో కొన్ని అడుగులు నడిచాడు. ‘చాలా రోజుల తర్వాత మా అబ్బారుు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. నొప్పిగా ఉన్నా కొన్ని అడుగులు వేశాడు. చాలా సంతోషంగా ఉంది’ అని నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వాకర్ సాయంతో అడుగులు వేస్తున్న నిఖిల్ రెడ్డి -
మయూరం..వయ్యారం!
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సోమవారం ఉదయం ఓ మయూరం వయ్యారంగా నడుస్తూ కనువిందు చేసింది. రోడ్డు పైకి వచ్చిన ఆ నెమలి... సెంట్రల్ మీడియన్‌లో ఆకలి తీర్చుకొని తుర్రుమంది. వాకర్లు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. – ఫొటోలు... దయాకర్ తూనుగుంట్ల -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
దేవరపల్లి : స్థానిక కరుటూరి ఫంక్షన్‌హాలు వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బందపురానికి చెందిన కాకరపర్తి వేములియ్య(60) కరుటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి హాజరై సోమవారం తెల్లవారుజామున బయటకు వచ్చారు. రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వేములియ్య అక్కడకక్కడే మృతి చెందాడు. -
టీ తాగేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం గూడ్స్ షెడ్డు నుంచి తణుకు వైపు వెళ్తున్న లోడు లారీ అతివేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వార్ఫ్ రోడ్డు ఇరిగేషన్ కార్యాలయం వెనుక నివాసముంటున్న బంగారు అప్పారావు (55) ఆదివారం టీ తాగేందుకు పోలీస్ ఐలాండ్ సెంటర్లో రోడ్డు దాటుతుండగా గూడ్స్ షెడ్డు నుంచి వస్తున్న లోడు లారీ ఢీకొంది. దీంతో కిందపడిన సుబ్బారావు రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న అతడ్ని అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రిగా తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుని కుమారుడు బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోటార్‌సైకిల్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
పాలకొల్లు సెంట్రల్ : మోటార్ సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘట న పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ంలోని మారుతి సెంటర్ అచ్చుగట్లపాలెంలో నివాసముం టున్న కాకుల శివాజీ (60) బుధవారం స్థానిక రైల్వేగేటు గూడ్స్ రోడ్డు నుంచి నడిచి వెళ్తుండగా మోటార్ సైకిల్‌పై వస్తున్న సిర్రా వెంకటరత్నం ఢీకొట్టాడు. దీంతో శివాజీ తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివాజీ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరత్నంపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. గురువారం మృతదేహానికి పంచనామా చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు శివాజీ వివరాలను ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అతని కుమారుడు అనిల్‌ను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చే శారు. -
రోడ్డు ప్రమాదంలో వాకర్ మృతి
వేగంగా వెళ్తున్న టాటాఏస్ వాహనం వాకింగ్ చేస్తున్న వారి పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి బసినకొండ బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసులు(40) సిగ్మాల్ కంపెనీలో రిప్రెజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం భార్య గైరమ్మ(35) బంధువుల అబ్బాయి ఉదయ్(12)తో కలిసి బైపాస్‌రోడ్డు పై వాకింగ్‌కు వెళ్లారు. వేగంగా వస్తున్న టాటాఏస్ వాహనం వాకింగ్ చేస్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
వనం.. ఖాకీమయం
కాల్పుల ఘటనతో పోలీస్ అలర్ట్ కేబీఆర్ పార్కు వద్ద భారీ బందోబస్తు రక్షక్, స్పెషల్ వాహనాలలో గస్తీ అడుగడుగునా పోలీసులే... సడలని ధీమా...పార్కుకు తగ్గని రద్దీ బంజారాహిల్స్: కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజు...కేబీఆర్ పార్కులో సీన్ మారింది. నిన్నటిదాకా వందలకొద్ది వాకర్లు మాత్రమే నడిచే వాక్‌వే కనిపించేది. కానీ గురువారం అందుకు భిన్నంగా అడుగడుగునా ఖాకీలు కనిపించారు. బుధవారం ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు ఏకే-47తో కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భద్రతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వ యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగజేసుకోవాల్సి వచ్చిం ది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్నారు. నిన్నమొన్నటిదాకా ఒక్క హోంగార్డు కూడా తిరగని ఈ పార్కు వద్ద గురువారం తెల్లవారుజామున నాలుగు గంట ల నుంచే భారీగా పోలీసులను మోహరించారు. హోంగార్డు స్థాయి నుంచి అధికారి వరకు పార్కు చుట్టూ రౌండ్లేశారు. సాయుధ బలగాల మోహరించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పోలీసు వాహనాలు సుమారు 12 వరకు పార్కు చుట్టూ రౌండ్లు కొట్టాయి. వీటికి తోడు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా రక్షక్ వాహనాలను రప్పించారు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ నాగరాజు, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐలు పార్కు చుట్టూ నిఘా ఉంచారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. మొత్తానికి కేబీఆర్ పార్కు పోలీసు దిగ్బంధంలో ఉండిపోయింది. నిఘా మధ్య సామాన్యులు, వీఐపీలు, వీవీఐపీలు వాకింగ్ చేయాల్సి వచ్చింది.