
Actress Nimrat Kaur Leg Injury: నటి నిమ్రత్ కౌర్ తాజాగా ఎయిర్‌పోర్టులో కాలికి గాయంతో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సహాయంతో ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో కాలికి ఏమైందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. వ్యాయామం చేస్తుండగా దెబ్బ తగిలిందని నిమ్రత్ పేర్కొంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటునట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిమ్రత్ త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ ప్రస్తుతం దస్వీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment