డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుంచి విడుదలైంది.‘సడక్ 2’, ‘బాట్లా హౌస్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన క్రిసాన్.. మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయి 2 వారాల జైలు శిక్ష అనుభవించింది. అయితే ఈ కేసులో కావాలనే ఇరికించారంటూ నటి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆమెను నిర్దోశిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన హైకోర్టు
ఇంతకీ ఏమైందంటే..నటి క్రిసాన్ పెరీరాను ట్రాప్ చేసిన నిందితులు ఆంథోనీ పాల్, అతని స్నేహితుడు రాజేష్ దామోదర్‌లు ఓ వెబ్‌సిరీస్ ఆడిషన్ కోసం కాఫీ షాపులో ఆమెను కలిసి సినిమా స్టైల్‌లో కథను వివరించారు. తిరిగి వెళ్లే సమయంలో ఆమెకు ఓ ట్రోఫీని అందజేశారు. దీన్ని యూఎఈలో మరొకరికి ఇవ్వాలని, ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమని నమ్మబలికారు.
ఎయిర్‌పోర్టులో క్రిసాన్ వద్ద నుంచి ట్రోఫీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో గంజాయి, మాదక ద్రవ్యాలను గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తమ కూతుర్ని కావాలనే ఈ కేసులో ఇరికించారని క్రిసాన్ పేరెంట్స్ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో
గతంలో ఓ పెంపుడు కుక్క విషయంలో క్రిసాన్ తల్లి ,ఆంథోనీ పాల్‌కు గొడవ జరిగిందని, దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో కూతురు క్రిసాన్‌ను ఇరికించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జైలు నుంచి విడుదలైన క్రిసాన్ పేరెంట్స్‌కి ఫోన్ చేసి జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment