సాక్షి, హైదరాబాద్: నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడం అమానుషమని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. బీజేపీ నాయకులతో కలసి బుధవారం ఆయన గ్లోబల్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. సిబ్బంది, డాక్టర్లు, పోలీసులపై కూడా దౌర్జన్యం జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎంఐఎం మద్దతుతో గతంలో నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రులపై, జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడులు జరగడం బహిరంగ రహస్యమే అని పేర్కొన్నారు.
ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారిపై, దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ , బీజేపీ మీడియా కమిటీ కన్వీనర్ వి.సుధాకర్ శర్మ, బీజేపీ నగర కార్యదర్శి ఎన్.గౌతమ్ రావులు ఉన్నారు.
ఆస్పత్రిపై దాడి అమానుషం
Published Thu, Dec 27 2018 1:31 AM | Last Updated on Thu, Dec 27 2018 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment