MLC Ramachandar Rao
-
ఆస్పత్రిపై దాడి అమానుషం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడం అమానుషమని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు అన్నారు. బీజేపీ నాయకులతో కలసి బుధవారం ఆయన గ్లోబల్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. సిబ్బంది, డాక్టర్లు, పోలీసులపై కూడా దౌర్జన్యం జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎంఐఎం మద్దతుతో గతంలో నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రులపై, జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడులు జరగడం బహిరంగ రహస్యమే అని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారిపై, దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ , బీజేపీ మీడియా కమిటీ కన్వీనర్ వి.సుధాకర్ శర్మ, బీజేపీ నగర కార్యదర్శి ఎన్.గౌతమ్ రావులు ఉన్నారు. -
ఉద్దేశపూర్వకంగానే పేరు తొలగింపు: రామచందర్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు స్థానిక ఎంపీని, ఎమ్మెల్సీని ఆహ్వానించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సికింద్రాబాద్లో నిర్వహించబోయే మేడే కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు లేకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకి స్తుందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే ప్రభుత్వ కార్యక్ర మాలను ప్రజాస్వామికంగా అడ్డుకుంటామన్నారు.