ఉద్దేశపూర్వకంగానే పేరు తొలగింపు: రామచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు స్థానిక ఎంపీని, ఎమ్మెల్సీని ఆహ్వానించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సికింద్రాబాద్‌లో నిర్వహించబోయే మేడే కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆరోపించారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు లేకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకి స్తుందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే ప్రభుత్వ కార్యక్ర మాలను ప్రజాస్వామికంగా అడ్డుకుంటామన్నారు.