హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. చర్లపల్లి జైలు నుంచి ఓ నిందితుడిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కోర్టుకు కారులో తరలిస్తుండగా పోలీసు వాహనం ఇన్నోవా కారును ఢీకొట్టింది.
ఇందులో రవి, క్రిష్ణ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఎల్బీనగర్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.