
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం దోరకుంట వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేగంగా వస్తున్న ఇన్నోవా కారు ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టలు షాపింగ్ చేసి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం సంబవించింది. బాధితులు వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామస్తులు.
Comments
Please login to add a commentAdd a comment