innova car
-
ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే -
ఇన్నోవా కారు బీభత్సం.. పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతుండగా..
సాక్షి, మేడ్చల్: ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన సంఘటన మేడ్చల్ పట్టణంలోని 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగం కారణంగా అదుపుతప్పి ఏజీఎస్ వెంచర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొని ఎదురు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్న రెండు బైక్‌లను, అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న సాయితేజ(19), సాయికిశోర్(20) అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికిశోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో బైక్ పై వెళ్తున్న దంపతులు బందెల రవి, మమత వారి కుమార్తె యోగితతో పాటు అశోక్ లేలాండ్ వాహన డ్రైవర్ హరిచంద్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతూ... దుండిగల్ మండలం, బహదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సాయితేజ స్నేహితులు. పిజ్జా హంట్‌లో పనిచేస్తున్న వీరు ఇరువురు శుక్రవారం పిజ్జాలు డెలివరీ చేసేందుకు కొంపల్లివైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు డివైడర్ అవతలి వైపు వెళ్తున్న వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయితేజకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిశోర్‌ను స్థానిక మెడినోవా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..
సాక్షి, శివాజీనగర: బెంగళూరు నృపతుంగ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే హరతాళు హాలప్ప కుమార్తె ప్రయాణి స్తున్న కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు... యలహంక న్యూటౌన్‌కు చెందిన మోహన్ కారు నడుపుతున్నాడు. కారులో ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ సుష్మిత ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమెను డ్రైవర్ మోహన్ డ్యూటీకి తీసుకెళుతున్నాడు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు వచ్చి హడ్సన్ సర్కిల్ ఎడమ వైపునకు తిరిగేందుకు ప్రయత్నించగా సిగ్నల్ పడింది. దీంతో వేగంగా వచ్చిన మోహన్ రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలకు ఢీకొన్నాడు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతులను హెచ్బీఆర్ లేఔట్‌కు చెందిన మజీద్ ఖాన్ (36) కే.జీ.హళ్లికి చెందిన అయ్యప్ప (60)లుగా గుర్తించారు. సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కి.. సిగ్నల్ వద్దకు రాగానే బ్రేక్ వేయకుండా ఎక్సలేటర్‌పై కాలుపెట్టడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ మోహన్ పోలీసుల ముందు తప్పు ఒప్పుకొన్నాడు. పోలీసులు అతని వాంగ్మూలన్ని రికార్డు చేసుకున్నారు. వాహనం నడిపే సమయంలో మోహన్ ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే విషయంపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేఏ 50 ఎంఏ 6600 నంబర్ కలిగిన కారుపై ఎమ్మెల్యే హాలప్ప పేరున్న స్టిక్కర్ అంటించి ఉంది. ఈ కారు యలహంకకు చెందిన రాము సురేశ్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇతను ఎమ్మెల్యేకు చెందిన మనిషిగా భావిస్తున్నారు. డ్రైవర్ ర్యాష్‌గా వాహనాన్ని నడుపుకుంటూ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించటం నేరం: ప్రమాదానికి కారణమైన ఇన్నోవాకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. రాజకీయ నాయకులు ఉపయోగించని వాహనాలపై ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించటం చట్ట వ్యతిరేకం. హలసూరు గేట్ స్టేషన్లో కేసు: డ్రైవర్ మోహన్‌ను ఆల్కోమీటర్ పరీక్షించగా మద్యం సేవించలేదని తేలిందని డీసీపీ (ట్రాఫిక్) కళా కృష్ణస్వామి తెలిపారు. హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఇటీవలే పెళ్లి, అంతలోనే ఆత్మహత్య ) -
నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు
సాక్షి, బనశంకరి: అనుమానాస్పదంగా కారు నిలిపి నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్జీన ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఇన్నోవా కారును రోడ్డు పక్కన నిలిపి కరెన్సీనోట్లు లెక్కిస్తున్నారు. గస్తీలో ఉన్న పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. వారిద్దరూ హుసూ్కరు గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్ మల్లేశ్, నెలమంగల రాజేశ్‌గా తేలింది. లెక్కిస్తున్న నగదుకు సంబంధించి వివరాలు చెప్పాలని పోలీసులు కోరగా నీళ్లు నమిలారు. దీంతో నగదును స్వా«దీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు నగదు అప్పజెప్పారు. (చదవండి: వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడకు వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..) -
ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు
కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు. -
విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి
సాక్షి, చేవెళ్ల: అతివేగం, అజాగ్రత్త ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. పలువురికి గాయాలవగా.. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చేవెళ్ల మండలంలోని కేసారం బస్‌స్టేజీ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తల్లీకూతుళ్లతో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, బాదితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్‌లోని లింగపల్లి మయూరినగర్‌కు చెందిన భార్యభర్తలు రవికుమార్, స్రవంతి(30) తమ ఇద్దరు కూతూళ్లు మోక్ష, ధ్రువిక(5)తో కలిసి ఆల్టో కారులో హైదరాబాద్ నుంచి తాండూరు (కరన్‌కోట్) వెళ్తున్నారు. రవికుమార్ తాండూరు సమీపంలోని సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఫ్యాక్టరీకి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్నాడు. చేవెళ్ల మండలంలోని కేసారం గేట్‌వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా.. వీరి ముందున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు రోడ్డు పక్కకు వెళ్లిఆగిపోయింది. అదే వేగంతో ఉన్న ఇన్నోవా.. స్విఫ్ట్ వెనకాలే వస్తున్న రవికుమార్ ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టగా.. ఇన్నోవా కారు రోడ్డుపై బోల్తాపడింది. బోల్తాపడిన ఇన్నోవా కారును ఆ వెనకాలే వస్తున్న మరో ఇన్నోవా కారు ఢీకొట్టినా.. ఇందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదమేమీ జరగలేదు. ఆల్టోలో ఉన్న రవికుమార్‌తో పాటు మోక్షకు తీవ్రగాయాలయ్యాయి. పక్కసీట్లో కూర్చున్న స్రవంతి, ధ్రువిక కారులోనే ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందారు. చదవండి: మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్ బోల్తాపడిన ఇన్నోవా కారులో సయ్యద్ ఫైజల్(21) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఇందులో ప్రయాణిస్తున్న యువకులు జాఫర్, అలీ, రిజ్వాన్, అన్వర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడనుంచి పలువురు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి.. పార్టీకోసం వెళ్లి.. ఇన్నోవాకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు ఆదివారం చేవెళ్లలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకోసం హాజరయ్యారు. రాత్రి అక్కడే ఉండి విందు చేసుకుని, ఉదయాన్నే హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. బర్త్ డే కోసం వచ్చి.. రవికుమార్ చిన్న కూతురు ధ్రువిక పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఉండే తల్లిదండ్రులు, అత్తామామల వద్దకు వచ్చాడు. హైదరాబాద్‌లోని మయూరినగర్‌లోని లింగంపల్లి వీరి స్వస్థలం. ఉద్యోగ రీత్యా తాండూరులో ఉంటున్న రవికుమార్ కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం శనివారం తమ తల్లిదండ్రులు ఉండే లింగపల్లి చేరుకున్నారు. ఆదివారం చార్మినర్ ప్రాంతంలోని అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడ రాత్రి ఉన్నారు. తిరిగి సోమవారం ఉదయం ఉద్యోగంకోసం తాండూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రవికుమార్, పెద్ద కూతురు మోక్షలు గాయాలతో బయటపడగా.. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని వెళ్తున్న చిన్న కూతురు ధ్రువిక, భార్య మృతిచెందారు. -
లే.. నాన్నా.. లే! ...అందర్నీ కంటతడి పెట్టించే ఆక్రందన!
ఉరవకొండ(అనంతపురం): రెండ్రోజుల్లో వస్తానమ్మా అన్నావ్‌గా నాన్నా.. అంతలోనే ఇలా నన్ను వదిలి వెళతావా..? నీవు నాకు కావాలి.. లే నాన్నా.. లే’ అంటూ నవ వధువు ప్రశాంతి తన తండ్రి కోకా వెంకటప్ప మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. బళ్లారిలో కుమార్తె ప్రశాంతి వివాహ వేడుక అనంతరం దగ్గరి బంధువులతో కలిసి బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు ఇన్నోవా వాహనంలో ఆదివారం సాయంత్రం నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. వెంకటప్ప మృతదేహాన్ని స్వగ్రామం నింబగల్లుకు సోమవారం తీసుకొచ్చారు. తండ్రిని కడసారి చూసేందుకు కర్ణాటక రాష్ట్రం దావణగెరె నుంచి నవ వధువు ప్రశాంతి, కుమారుడు సతీష్ స్వగ్రామానికి వచ్చారు. మృతదేహం వద్ద ప్రశాంతిని పట్టుకుని తల్లి దాక్షాయణి ‘నీకు ఇక నాన్న లేడమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఎవరి కోసం బతకాలి... ప్రమాదంలో మృతి చెందిన లత్తవరం గ్రామానికి చెందిన స్వాతి భర్త శ్రీధర్ రోదన వర్ణనాతీతంగా మారింది. బళ్లారిలో వివాహ వేడుకలు ముగించుకుని శ్రీధర్ తన భార్య స్వాతి, ఇద్దరు కవలలు జాహ్నవి, జశ్వంత్‌తో ఇన్నోవా వాహనం ఎక్కారు. అయితే స్వాతి తమ్ముడు అశోక్ వచ్చి ‘బావా నేను చాలా అలసిపోయాను. నీవు బైక్‌లో ఉరవకొండకు రా. నేను, అక్క, పిల్లలు ఇన్నోవాలో వెళతాం’ అని శ్రీధర్‌ను కోరాడు. ప్రమాదంలో వారంతా చనిపోవడంతో ‘నాకు ప్రాణ భిక్ష పెట్టి.. మీరంతా కానరాని లోకాలకు వెళ్లిపోతిరా’ అంటూ శ్రీధర్ విలపించాడు. కవలల మృతితో పాఠశాలకు సెలవు ఉరవకొండలోని ఎడిసన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న కవలలు జాహ్నవి, జశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సోమవారం పాఠశాలకు సెలవు ఇచ్చారు. మృత్యువులోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం బూదగవి రోడ్డు ప్రమాదం బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి, పిల్లలపల్లి గ్రామాల్లో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. రాయలప్పదొడ్డికి చెందిన కవలకుంట్ల లచ్చన్న, ఈరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ, దాక్షాయణి, కుమారుడు బసవరాజు ఉన్నారు. బసవరాజు రెండు నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు. అక్కాచెల్లెళ్లు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మలు కోకా వెంకటప్ప కుమార్తె ప్రశాంతి వివాహానికని బళ్లారికి వెళ్లారు. ఆదివారం వేడుక ముగియగానే తిరిగింపుల ఏర్పాట్ల కోసం బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ ఉన్నారు. కడచూపునకు నోచని కుమారుడు సుభద్రమ్మ, తిమ్మప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. కుటుంబ పెద్ద సుభద్రమ్మ భర్త తిమ్మప్ప ఏడాది క్రితం కోవిడ్‌తో మృతిచెందాడు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. చిన్న కుమార్తె సునీత తల్లితో కలిసి ఉంటోంది. కుమారుడు సతీష్ జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. తల్లి, పెద్దమ్మలు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే భారత్‌కు వచ్చేందుకు బయల్దేరాడు. అయితే జర్మనీ అయితే జర్మనీ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా సతీష్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడే నిలిచిపోయాడు. కన్నీటి వీడ్కోలు బూదగవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందికి ఆదివారం అర్ధరాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు డాక్టర్ ఎర్రిస్వామిరెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ ఆశా, గుంతకల్లుకు చెందిన డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ అబుబకర్ పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయానికల్లా నింబగల్లుకు చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప (58), బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి (60), ఆమె కుమారుడు అశోక్ (35), లత్తవరానికి చెందిన స్వాతి(38), ఆమె కవల పిల్లలు జాహ్నవి, జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ (48), బ్రహ్మసముద్రం మండలం పిల్లలదొడ్డికి చెందిన శివమ్మ (35), రాయలప్పదొడ్డికి చెందిన సుభ్రదమ్మ (58) మృతదేహాలు స్వగ్రామాలకు చేరాయి. పెళ్లికని వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరుపెట్టారు. అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ కిడ్నాప్ కలకలం
కృష్ణాజిల్లా: విజయవాడ పెనమలూరు పీఎస్ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రశాంతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్ కలర్ కారులో వినోద్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని వినోద్ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై.. -
కొంపల్లిలో ఇన్నోవా బీభత్సం
-
ఇన్నోవాను ఆటోతో ఓవర్‌టెక్ చేశాడని..
సాక్షి, హైదరాబాద్ : కారుని ఓవర్ టేక్ చేశాడనే కోపంతో ఆటో డ్రైవర్ని నిర్బంధించి చితక బాదిన ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రమేష్ తన మిత్రుడుతో కలిసి నల్లగండ్ల పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నారు. అదే వైపు ఇన్నోవా కారులో కొంతమంది యువకులు వెళ్తున్నారు. కారుని ఆటోతో ఓవర్ టేక్ చేశాడనే కోపంతో చేజ్ చేసి ఆటోను అడ్డగించారు. అంతటితో ఆగకుండా రమేష్‌ను కారులో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని వదిలి పెట్టి పోయారు. మూడు రోజులు క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రమేష్‌కు చికిత్స అందిస్తున్నారు. -
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం దోరకుంట వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేగంగా వస్తున్న ఇన్నోవా కారు ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టలు షాపింగ్ చేసి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం సంబవించింది. బాధితులు వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామస్తులు. -
ఇన్నోవా బీభత్సం..
బొల్లారం: తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఇన్నోవా కారు (టియస్09–ఇవి–8070) అతి వేగంతో వచ్చి భీభత్సం సృష్టించింది. పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ నుంచి వస్తున్న కారు తిరుమలగిరి సిగ్నల్ పాయింట్ ముందు ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహనాలను డీ కోడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు,రెండు ద్విచక్రవాహనాలు,తో పాటు ఒక ఆటో దెబ్బతిన్నాయి. నిర్లక్ష్యంగా కారు నడిపిన నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్పగాయలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలగిరి ఇన్స్పెక్టర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
-
గత రాత్రి ఒక్కటైనా జంట.. వరుడు మృతి
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. వివరాలివి.. తణుకులో గతరాత్రి(గురువారం) బంధువుల సమక్షంలో వారికి పెళ్లి పెరిగింది. ఎంతో సంతోషంతో అందరూ తిరిగి ప్రయాణమయ్యారు. వధువు, వరుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా, వధువుకు గాయలయ్యాయి. మృతులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులుగా గుర్తించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారు కొమ్మటూరు శరత్, శ్రీదేవి దంపతులు, పద్మ, పెండ్లి కొడుకు రామకృష్ణ ప్రసాద్, వడ్లకొండ, డ్రైవర్ వేణుగా గుర్తించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, యాదాద్రి: భువనగిరి బైపాస్లోఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాలివి.. మృతులు కోహేడకు చెందిన శ్రీశైలం, శ్రీనివాస్‌గా గుర్తించారు. కారులోనే మృతదేహాలు ఇరుక్కుపోయాయి. హైవే అథారిటీకి చెందిన కార్మికుడు కొండలరెడ్డి మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రైవర్‌ను బండరాయితో మోది..
♦ఇన్నోవా కారును అపహరించుకుపోయిన ♦గుర్తుతెలియని దుండగుడు ♦ పరిస్థితి విషమం..హైదరాబాద్‌కు తరలింపు ♦ సూర్యాపేటలో ఘటన సూర్యాపేట క్రైం గుర్తుతెలియని దుండగుడు ఇన్నోవా కారు డ్రైవర్‌ను బండరాయితో మోది వాహనాన్ని అపహరించుకుపోయాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో గల అడ్డాపై తనకు చెందిన ఇన్నోవా వాహనాన్ని హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఆరీఫుద్దీన్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిలిపి ఉన్నాడు. అంతలోపే ఓ గుర్తుతెలియని వ్యక్తి కారు వద్దకు వచ్చాడు. కారు వద్ద ఉన్న అతడిని రాజమండ్రికి వెళ్లాలి.. కిరాయికి వస్తారా అని అడిగాడు. వెంటనే వస్తా సార్ అని తెలపడంతో.. కిరాయి మాట్లాడుకొని.. గుర్తుతెలియని వ్యక్తిని కారులో ఎక్కించుకొని ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అయితే.. డ్రైవర్‌కు సదరు వ్యక్తి మార్గమధ్యలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల జమ్మిగడ్డలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై రెండు గంటల పాటు వేచి ఉండాలని తెలిపాడు. దానికి డ్రైవర్ సరే అని చెప్పాడు. సరిగ్గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్దకు గురువారం తెల్లవారుజామున 12:40 నిమిషాలకు చేరుకున్నారు. కారు డ్రైవర్‌కు సదరు వ్యక్తికి సంబంధించిన ఇరువురు స్నేహితులు రాజమండ్రికి తీసుకెళ్లాల్సి ఉందనడంతో అక్కడే వేచి చూస్తున్నారు. అయితే కారు డ్రైవర్‌కు నిద్ర వస్తుండడంతో కారును పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై నిలిపి నిద్రలోకి జారుకున్నాడు. డ్రైవర్ పరిస్థితి విషమం.. డ్రైవర్ ఆరిపుద్దీన్ తల, ముఖంపై బండరాయితో గుర్తుతెలియని వ్యక్తి బలంగా మోదడంతో.. తీవ్ర రక్తస్రావమై కన్ను పగిలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియాస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుంటూరుకు తరలివెళ్లిన పోలీసులు కారును ఎత్తికెళ్లిన దుండగుడి కోసం సూర్యాపేట పోలీసులు గుంటూరుకు వెళ్లారు. కారు గూంటూరు జిల్లాలోని చీరాలలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. మూడు గంటల ప్రాంతంలో.. కారు డ్రైవర్ కిరాయికి కారు తీసుకొచ్చిన సదరు వ్యక్తికి సంబంధించిన వ్యక్తుల కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఏమైందో ఏమో.. కానీ కారు డ్రైవర్ నిద్రలోంచి తేరుకునే లోపే తీవ్ర రక్తస్రావంలో మునిగిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తి కారు డ్రైవర్‌పై బండరాయితో తల, ముఖంపై బలంగా మోదాడు. దీంతో డ్రైవర్ తల పగిలిపోవడంతో పాటు ఎడమ కన్ను బయటపడింది. డ్రైవర్‌ను జుట్టుపట్టుకొని రహదారిపైకి తీసుకొచ్చి.. డివైడర్కేసి బాదాడు. అంతేకాకుండా కారులోకి ఎక్కించుకొని ఘటనస్థలానికి కొంచెం దూరంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. కానీ డ్రైవర్ కారులోకి ఎక్కకుండా పరిగెత్తుతూ సూర్యాపేట పట్టణంలోకి ప్రవేశించాడు. డ్రైవర్ పట్టణంలోకి ప్రవేశించడమే ఆలస్యం.. గుర్తుతెలియని వ్యక్తి ఇన్నోవా కారును తీసుకొని విజయవాడ వైపునకు వెళ్లాడు. అయితే డ్రైవర్ సెల్‌ఫోన్ కారులోనే ఉండిపోయింది. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను.. సమీపంలోని టింబర్ డిపో యజమాని గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు క్రాంతి, డానేల్ కుమార్‌లు ఉన్నారు. -
డ్రైవర్‌ను చావబాది.. ఇన్నోవాతో పరారీ
సూర్యాపేట: రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లాలని కారు అద్దెకు తీసుకున్న వ్యక్తి మార్గమధ్యలో డ్రైవర్‌పై దాడి చేసి కారుతో సహా పరారయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట శివారులో గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. బుధవారం రాత్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఓ వ్యక్తి ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నాడు. వాహనం సూర్యాపేట వద్దకు రాగానే డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి కిందకు దిగి బండరాయితో అతని పై దాడి చేసి ఇన్నోవాతో ఉడాయించాడు. ఇది గుర్తించిన స్థానికులు డ్రైవర్ ఆరిఫుద్దీన్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సునితా మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోయిన హీరోయిన్ కారు దొరికింది
ముంబయి: ప్రముఖ నటి సోనాలీ బింద్రే కారు దొరికింది. ముంబయిలో మాయమైన ఆమె కారు రాజస్థాన్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం పోలీసులు ఆమె కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోనాలీకి చెందిన ఇన్నోవా కారును గత ఏడాది ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆమె కారు జాడ తెలియలేదు. గత ఏడాది నవంబర్ నెలలో రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో పోలీసులు ఎంఎస్ 02 సీపీ 2030 అనే కారును స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందులను పంపిణీ చేసే స్మగ్లర్ల నుంచి ఈ కారును సీజ్ చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా తాజాగా ఆ కారు సోనాలీ బింద్రే పేరిట నమోదు అయ్యి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఈ విషయం తెలియజేయగా బింద్రేకు సంబంధించిన వ్యక్తిగత న్యాయవాది కోర్టుకు హాజరై ఆమె కారును తీసుకెళ్లారు. గత ఏడాది అక్టోబర్ 1న సోనాలీ కారు పోయింది. ఆ సమయంలో ఆమె భర్త గోల్డీ బెహల్ మరుసటి రోజే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఇన్నోవాలే టార్గెట్
► కారు అపహరణపై ముమ్మరంగా దర్యాప్తు ► ఇప్పటి వరకు తమిళనాడు పరిధిలో జరిగాయి ► తాజాగా జిల్లా పరిధిలో.. తడ : సరిహద్దు ప్రాంతం పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై శనివారం రా త్రి ఇన్నోవా కారు చోరీకి గురైన ఘట నకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవ లి కాలంలో ఈ ప్రాంతంలోనే ముఖ్యం గా ఇన్నోవా కార్లే టార్గెట్ చేసి అపహరించుకు వెళ్లడంపై పోలీసులు విచారణ మెదలు పెట్టారు. సూళ్లూరుపేట సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్ఐ ఏ సురేష్‌బాబు, ఐడీ పోలీసులు బృందాలుగా గుమ్మిడిపూండి, ఎళాఊరు ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. తమదాక వ చ్చేసరికి .. ఇటీవల చోరీకి గురైన రెండు కార్లు తమిళనాడు పరిధిలో జరగడంతో కొంత అలసత్వం వహించిన సరిహద్దు పోలీస్‌స్టేషన్ అధికారులు తాజా సంఘటనతో ఉలిక్కిపడ్డారు. పక్షం రోజుల్లో తమిళనాడు-ఆంధ్రా సరిహద్దుల్లో జరిగిన కార్ల సంఘటనలు పరిశీలిస్తే.. నలుగురు దుండగులు రెండు బైక్‌ల్లో వచ్చి అటకాయించి డ్రైవర్లను బెదిరించి కార్లు ఎత్తుకు వెళ్లేవారు. తాజా ఘటనలో దుండగులు పెద్దగా శ్రమలేకుండా కారును అపహరించారు. చోరీలన్నీ ఒకే ముఠా చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం చోరీ జరిగిన పన్నంగాడు ప్రాంతం సమీపంలోనే ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు కూడా ఉంది. ఇక్కడ నిరంతరం ఏఆర్, సివిల్ పోలీసులు ఉంటారు. అయినా దుండగులు దర్జాగా చోరీలకు పాల్పడుతుండటం విశేషం. ఏసీ ఆన్‌లో ఉంచేందుకే స్టార్టింగ్ ఉంచారు.. శనివారం రాత్రి చోరీకి గురైన కారు డ్రైవర్ రవి సమాచారం మేరకు చెన్నైలో ఆసుపత్రి నుంచి బయలుదేరిన బాధితులు పన్నంగాడు వద్ద మామిడి పండ్లు కొనేందుకు కారుని ఆపి రోడ్డు దాటి అవతలకు వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న భారతమ్మను కారులోనే ఉంచి ఏసీ కోసం స్టార్టింగ్‌లో ఉంచారు. ఈ అవకాశమే దుండగులకు అనుకూలంగా మారింది. దుండగులు కారును అపహరించి కొంత దూరం వెళ్లాక పాత పెట్రోల్ బంక్ వద్ద మరో వ్యక్తి కారులో ఎక్కి భారతమ్మకు కత్తి చూపడంతో ఆమె తన మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసు వారికి ఇచ్చేసింది. చేతికి ఉన్న గాజులు తీసేందుకు ప్రయత్నించిన దొంగలు రాకపోవడంతో వాటిని వదిలి భారతమ్మను దించేసి ఆరంబాకం వైపు వెళ్లిపోయారు. కారు లేకపోవడం గమనించిన డ్రైవర్ అటుగా వెళుతున్న ఆటోను ఆపి వెతుక్కుంటూ వెళ్లగా భారతమ్మ రామాపురం సమీపంలో రోడ్డు పక్కన ఉండటం గుర్తించి కారుపోయినా మనిషి కనిపించిందన్న సంతోషంతో ఊపిరి పీల్చుకున్నాడు. కారులో మరో లక్షన్నర నగదు ఉన్నట్టు బాదితులు తెలిపారు. కారు ఆరంబాకం ముందు ఉన్న మలుపు వద్ద తిప్పుకుని తిరిగి చెన్నై వైపు వెళ్లినట్టు భావిస్తున్నారు. కారుని ఎవరో ఫాలో అవుతున్నట్టు డ్రైవర్‌కు కొంత దూరం ముందే అనుమానం వచ్చినా ఎవరోలే అని పట్టించుకోలేదు. కారు వద్దకు వచ్చిన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ బైక్‌పై రాగా మరో ఇద్దరు పెట్రోల్ బంక్ వద్ద మరో బైక్‌లో కాపు కాచినట్టు అనుమానిస్తున్నారు. సీసీ పుటేజీల పరిశీలన దొంగల కోసం గాలించడంలో భాగంగా పోలీసులు ఆదివారం సూళ్లూరుపేట సమీపంలోని టోల్‌ప్లాజాతో పాటు చెన్నై మార్గంలోని కార్నోడై టోల్‌ప్లాజాలోనూ సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు
హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. చర్లపల్లి జైలు నుంచి ఓ నిందితుడిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కోర్టుకు కారులో తరలిస్తుండగా పోలీసు వాహనం ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఇందులో రవి, క్రిష్ణ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఎల్బీనగర్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి
నల్లగొండ: ఇన్నోవా కారు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలం ఆగుపాముల సమీపంలో చోటుచేసుకుంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదుపు తప్పి మూసిలో పడిన ఇన్నోవా
హైదరాబాద్ : రోడ్డు మీద ఉన్న బ్రేకర్లను గుర్తించని ఇన్నోవా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మూసినదిలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇన్నోవాలో డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన పురానాపూల్ సమీపంలోని హైకోర్టు ఎదుట బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సిటీ కాళశాల నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వస్తున్న ఇన్నోవా వాహనం హైకోర్టుకు సమీపంలోకి రాగానే స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి మూసినదిలోకి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కారు బీభత్సం...
* మద్యం తాగి డ్రైవింగ్ * అదుపుతప్పి డివైడర్ ఎక్కిన కారు * పోలీసులపై యువకుల దాడి లంగర్‌హౌస్: తప్పతాగి ఉన్న ఇద్దరు అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించారు. అదుపుతప్పిన కారు డివైడర్‌పై నుంచి దాదాపు రెండు వందల మీటర్ల దూరం దూసుకెళ్లి తర్వాత గాలిలో ఎగిరి పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... టోలీచౌకి నదీం కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్(33), తన స్నేహితుడు ఖుద్రత్ ఖాన్‌తో కలిసి పీ అండ్ టీ కాలనీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మద్యం తాగాడు. తెల్లవారుజామున 4 గంటలకు తన ఇన్నోవా కారులో టోలీచౌకిలోని ఇంటికి బయల్దేరారు. లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. వేగంగా దూసుకెళ్లి ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టి.. గాలిలోకి లేచి 30 మీటర్ల దూరంలో పడింది. బ్రిడ్జిపై ఉన్న 8 సిమెంట్ దిమ్మెలు చెల్లాచెదురైపడగా.. కారు టైర్లు నాలుగూ పగిలిపోయాయి. ఒక టైర్ అక్కడే పాల వ్యాపారం చేస్తున్నవారిపై పడింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మత్తులో వీరంగం.... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న వారిని బయటకు దించారు. స్టేషన్‌కు రమ్మని వారిని కోరగా.. మద్యం మత్తులో ఉన్న అన్వర్, ఖుద్రత్‌లు తాము సీఎం మనుషులమని, మమ్మల్నే స్టేషన్‌కు రమ్మంటారా అంటూ పోలీసులపై దాడి చేశారు. జనం గుమిగూడటంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడని, తమ డ్రైవర్ కూడా పారిపోయాడని వారిపై కూడా వీరంగం సృష్టించారు. షెడ్డులో కారు...? లంగర్‌హౌస్ పోలీసులు, టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరగడానికి గంట ముందు వరకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి 7 కార్లు పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే, మద్యం తాగి కారు నడపడమే కాకుండా డివైడర్‌పై దూసుకెళ్లిన కారును మాత్రం సీజ్ చేయనీకుండా ఆ యువకులు పోలీసులతో గొడవపడ్డారు. మరమ్మత్తుల నిమిత్తం కారును బలవంతంగా షెడ్డుకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేయకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్నోవా కారు నుంచి బంగారం డబ్బు చోరీ
-
ఎర్టిగా కాదు.. ఇన్నోవాలే ముద్దు!
జంట కమిషనరేట్లకు పోలీసులకు సరికొత్త వాహనాలను సమకూర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.. ఇన్నోవాలనే ఎంచుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు రెండింటికీ కలిపి వంద వరకు వాహనాలు కావాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 1500 కార్లు కావల్సి వస్తాయన్నారు. ముందుగా ఇన్నోవా వాహనాలు తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మారుతి కంపెనీ ప్రతినిధులు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇన్నోవాది, తమది దాదాపు ఒకటే డిజైన్ అని, సీట్ల సామర్థ్యం కూడా సమానంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్నోవా ఖరీదు దాదాపు రూ. 16 లక్షలు కాగా ఎర్టిగా మాత్రం దాదాపు 10 లక్షలకే వస్తుందని, పైగా, ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. ఒక్కో వాహనానికి 6 లక్షల చొప్పున జంట కమిషనరేట్లలోని వంద వాహనాలకే 6 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉండేది. మొత్తం 1500 కార్లకు అయితే దాదాపు 90 కోట్ల వరకు మిగిలిది. అయితే ఎందుకో గానీ.. ఎర్టిగాకు బదులు ఇన్నోవాలనే తెలంగాణ సర్కారు ఎంచుకుంది. దాంతో ఇన్నోవాలే గురువారం నాటి పెరేడ్లో దర్శనమిచ్చాయి. కొసమెరుపు: ఈ కొత్త వాహనాలను పెరేడ్ చేసిన తొలిరోజే ఓ ఇన్నోవా స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోయినా వాహనం ముందుభాగం మాత్రం కొద్దిగా దెబ్బతింది. ఇంజన్ భాగంలోంచి కొంత ఆయిల్ కారింది.