ఇన్నోవాలే టార్గెట్
► కారు అపహరణపై ముమ్మరంగా దర్యాప్తు
► ఇప్పటి వరకు తమిళనాడు పరిధిలో జరిగాయి
► తాజాగా జిల్లా పరిధిలో..
తడ : సరిహద్దు ప్రాంతం పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై శనివారం రా త్రి ఇన్నోవా కారు చోరీకి గురైన ఘట నకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవ లి కాలంలో ఈ ప్రాంతంలోనే ముఖ్యం గా ఇన్నోవా కార్లే టార్గెట్ చేసి అపహరించుకు వెళ్లడంపై పోలీసులు విచారణ మెదలు పెట్టారు. సూళ్లూరుపేట సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్‌ఐ ఏ సురేష్‌బాబు, ఐడీ పోలీసులు బృందాలుగా గుమ్మిడిపూండి, ఎళాఊరు ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తున్నారు.
తమదాక వ చ్చేసరికి ..
ఇటీవల చోరీకి గురైన రెండు కార్లు తమిళనాడు పరిధిలో జరగడంతో కొంత అలసత్వం వహించిన సరిహద్దు పోలీస్‌స్టేషన్ అధికారులు తాజా సంఘటనతో ఉలిక్కిపడ్డారు. పక్షం రోజుల్లో తమిళనాడు-ఆంధ్రా సరిహద్దుల్లో జరిగిన కార్ల సంఘటనలు పరిశీలిస్తే.. నలుగురు దుండగులు రెండు బైక్‌ల్లో వచ్చి అటకాయించి డ్రైవర్లను బెదిరించి కార్లు ఎత్తుకు వెళ్లేవారు. తాజా ఘటనలో దుండగులు పెద్దగా శ్రమలేకుండా కారును అపహరించారు. చోరీలన్నీ ఒకే ముఠా చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం చోరీ జరిగిన పన్నంగాడు ప్రాంతం సమీపంలోనే ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు కూడా ఉంది. ఇక్కడ నిరంతరం ఏఆర్, సివిల్ పోలీసులు ఉంటారు. అయినా దుండగులు దర్జాగా చోరీలకు పాల్పడుతుండటం విశేషం.
ఏసీ ఆన్‌లో ఉంచేందుకే స్టార్టింగ్ ఉంచారు..
శనివారం రాత్రి చోరీకి గురైన కారు డ్రైవర్ రవి సమాచారం మేరకు చెన్నైలో ఆసుపత్రి నుంచి బయలుదేరిన బాధితులు పన్నంగాడు వద్ద మామిడి పండ్లు కొనేందుకు కారుని ఆపి రోడ్డు దాటి అవతలకు వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న భారతమ్మను కారులోనే ఉంచి ఏసీ కోసం స్టార్టింగ్‌లో ఉంచారు. ఈ అవకాశమే దుండగులకు అనుకూలంగా మారింది. దుండగులు కారును అపహరించి కొంత దూరం వెళ్లాక పాత పెట్రోల్ బంక్ వద్ద మరో వ్యక్తి కారులో ఎక్కి భారతమ్మకు కత్తి చూపడంతో ఆమె తన మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసు వారికి ఇచ్చేసింది. చేతికి ఉన్న గాజులు తీసేందుకు ప్రయత్నించిన దొంగలు రాకపోవడంతో వాటిని వదిలి భారతమ్మను దించేసి ఆరంబాకం వైపు వెళ్లిపోయారు. కారు లేకపోవడం గమనించిన డ్రైవర్ అటుగా వెళుతున్న ఆటోను ఆపి వెతుక్కుంటూ వెళ్లగా భారతమ్మ రామాపురం సమీపంలో రోడ్డు పక్కన ఉండటం గుర్తించి కారుపోయినా మనిషి కనిపించిందన్న సంతోషంతో ఊపిరి పీల్చుకున్నాడు. కారులో మరో లక్షన్నర నగదు ఉన్నట్టు బాదితులు తెలిపారు. కారు ఆరంబాకం ముందు ఉన్న మలుపు వద్ద తిప్పుకుని తిరిగి చెన్నై వైపు వెళ్లినట్టు భావిస్తున్నారు. కారుని ఎవరో ఫాలో అవుతున్నట్టు డ్రైవర్‌కు కొంత దూరం ముందే అనుమానం వచ్చినా ఎవరోలే అని పట్టించుకోలేదు. కారు వద్దకు వచ్చిన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ బైక్‌పై రాగా మరో ఇద్దరు పెట్రోల్ బంక్ వద్ద మరో బైక్‌లో కాపు కాచినట్టు అనుమానిస్తున్నారు.
సీసీ పుటేజీల పరిశీలన
దొంగల కోసం గాలించడంలో భాగంగా పోలీసులు ఆదివారం సూళ్లూరుపేట సమీపంలోని టోల్‌ప్లాజాతో పాటు చెన్నై మార్గంలోని కార్నోడై టోల్‌ప్లాజాలోనూ సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు.