బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి.
చదవండి: పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment