bus-car
-
ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే -
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని గాడుదుల గండి గుట్ట వద్ద మంథని-కాటారం ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36జెడ్ 0161 మంథని వైపుకు వస్తున్న కారు టీఎస్ 04ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టి బస్ లోయలో పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ తాటి వినీత్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 12మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను మంథని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కారు డ్రైవర్ తాటి వినీత్ మంత్రి విచారం లోయలో పడిన బస్సు దుర్ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు కావల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాలకు గురైన ప్రయాణీకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబసభ్యులకు తమ విచారం వ్యక్తం చేశారు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సును ఢీకొన్న కారు
తిరుమల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుమల రెండో కనుమ రహదారిలోని 12వ మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.