హైదరాబాద్ : రోడ్డు మీద ఉన్న బ్రేకర్‌లను గుర్తించని ఇన్నోవా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మూసినదిలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇన్నోవాలో డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన పురానాపూల్ సమీపంలోని హైకోర్టు ఎదుట బుధవారం తెల్లవారుజామున జరిగింది.
వివరాలు.. సిటీ కాళశాల నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వస్తున్న ఇన్నోవా వాహనం హైకోర్టుకు సమీపంలోకి రాగానే స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి మూసినదిలోకి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.