ఏ తల్లి కన్నబిడ్డో..! | one month baby on Musi River | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్నబిడ్డో..!

Nov 24 2024 7:58 AM | Updated on Nov 24 2024 9:57 AM

one month baby on Musi River

మూసీ ఒడ్డున పసికందు 

నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స  

చాదర్‌ఘాట్‌: ఏ తల్లి కన్నబిడ్డో. ఓ పసికందు అనాథగా మారాడు. శనివారం ఉదయం వాహెద్‌నగర్‌ (ఓల్డ్‌ మలక్‌పేట్‌) మూసీ నది ఒడ్డున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పసికందు ఏడుస్తున్న శబ్దం విన్న స్థానికులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారం అందించారు. 

ఎస్‌ఐ భరత్‌ ఆధ్వర్యంలో అజంపురా డివిజన్‌లోని ముస్లిం మెటరి్నటీ హాస్పిటల్‌లో పసికందుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు ఎస్‌ఐ భరత్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement