
సాక్షి, యాదాద్రి: భువనగిరి బైపాస్‌లోఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాలివి.. మృతులు కోహేడకు చెందిన శ్రీశైలం, శ్రీనివాస్‌గా గుర్తించారు. కారులోనే మృతదేహాలు ఇరుక్కుపోయాయి.
హైవే అథారిటీకి చెందిన కార్మికుడు కొండలరెడ్డి మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment