∙ఔటర్‌పై ముగ్గురు..
ఉండవల్లి వద్ద ఇద్దరు కూలీలు
శంషాబాద్/ఆత్మకూర్: రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైన వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. హైదరాబాద్‌లోని చిన్నగోల్కొండ ఫ్లైఓవర్‌పై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌సహా ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన తెలుగు రాజేష్ కుటుంబసభ్యులు ప్రతి ఏడాది శ్రావణమాసం రెండవ గురువారం యాదాద్రి దర్శనానికి వెళతారు.
ఈ ఏడాది కూడా యాదాద్రి దర్శనానికి బుధవారం రాజేష్ కుటుంబసభ్యులతో పాటు కర్నూల్‌కు చెందిన అత్తమామలతో కలిపి మొత్తం 19 మంది రెండు వాహనాల్లో బయలుదేరారు. గురువారం ఉదయం 11 గంటలకు దైవదర్శనం చేసుకొని..మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఓ కారు ముందుగా ఓ కారును ఢీకొట్టి..ఆపై పక్కనే ఉన్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో పల్టీ లు కొట్టింది.
తుఫాన్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ తాజుద్దీన్ (40)తో పాటు రాజేష్ భార్య సోదరి వరలక్ష్మి (44), ఆమె మనవడు 2 నెలల బాబు అక్కడికక్కడే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో బాలిక సాయిదీక్షిత (13) కోమాలోకి వెళ్లింది. చంద్రశేఖర్, మణెమ్మ, అర్చనలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆత్మకూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ నుంచి వచ్చిన ఆ కారుతోనే..
ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నారు. విదేశాలకు వెళుతున్న వారికి సెండాఫ్ ఇవ్వడానికి ఆరుగురు ఆ కారులో కరీంనగర్‌కు వచ్చి వస్తున్నారు. వారిలో ముగ్గురు మద్యం సేవించినట్టు పోలీసుల పరీక్షలో తేలింది. కారులో ఉన్న వారిలో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కారులో ఉన్న వారిని విచారిస్తున్నట్టు తెలిపారు.
కళ్ల ముందే..
మా జీపును కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. లోపల అందరం చిందరవందర అయ్యాం. కొందరు బయటపడ్డారు. నా కూతురు దీక్షిత తలకు పెద్దదెబ్బ తగిలింది. ఆరు నెలల క్రితమే నా భర్త చనిపోయాడు. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏమవుతోందో. – నవనీత
ఒక్కసారి భయమేసింది
ప్రమాదంతో జీపులోపల అందరం ఒకరినొకరం గుద్దుకున్నాం. నాకు తలకు దెబ్బ తగిలింది. చిన్నోడు చనిపోయాడు. మా చెల్లికి దీక్షిత తలకు గాయమైంది. దీంతో నాకు ఒక్కసారిగా భయమేసింది. – సాయిహర్షిత
Comments
Please login to add a commentAdd a comment