పోయిన హీరోయిన్‌ కారు దొరికింది | Sonali Bendre car stolen from Mumbai found in rajastan | Sakshi
Sakshi News home page

పోయిన హీరోయిన్‌ కారు దొరికింది

Published Tue, Apr 11 2017 5:26 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

పోయిన హీరోయిన్‌ కారు దొరికింది - Sakshi

పోయిన హీరోయిన్‌ కారు దొరికింది

ముంబయి: ప్రముఖ నటి సోనాలీ బింద్రే కారు దొరికింది. ముంబయిలో మాయమైన ఆమె కారు రాజస్థాన్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం పోలీసులు ఆమె కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోనాలీకి చెందిన ఇన్నోవా కారును గత ఏడాది ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆమె కారు జాడ తెలియలేదు. గత ఏడాది నవంబర్‌ నెలలో రాజస్థాన్‌లోని బార్మర్‌ ప్రాంతంలో పోలీసులు ఎంఎస్‌ 02 సీపీ 2030 అనే కారును స్వాధీనం చేసుకున్నారు.

మత్తుమందులను పంపిణీ చేసే స్మగ్లర్ల నుంచి ఈ కారును సీజ్‌ చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా తాజాగా ఆ కారు సోనాలీ బింద్రే పేరిట నమోదు అయ్యి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఈ విషయం తెలియజేయగా బింద్రేకు సంబంధించిన వ్యక్తిగత న్యాయవాది కోర్టుకు హాజరై ఆమె కారును తీసుకెళ్లారు. గత ఏడాది అక్టోబర్‌ 1న సోనాలీ కారు పోయింది. ఆ సమయంలో ఆమె భర్త గోల్డీ బెహల్‌ మరుసటి రోజే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement