
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. వివరాలివి.. తణుకులో గతరాత్రి(గురువారం) బంధువుల సమక్షంలో వారికి పెళ్లి పెరిగింది. ఎంతో సంతోషంతో అందరూ తిరిగి ప్రయాణమయ్యారు. వధువు, వరుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా, వధువుకు గాయలయ్యాయి. మృతులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులుగా గుర్తించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారు కొమ్మటూరు శరత్, శ్రీదేవి దంపతులు, పద్మ, పెండ్లి కొడుకు రామకృష్ణ ప్రసాద్, వడ్లకొండ, డ్రైవర్ వేణుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment