మాజీ ఎంపీ కల్పనాదేవి మృతి | The death of former MP kalpanadevi | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ కల్పనాదేవి మృతి

Published Sun, May 29 2016 10:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

The death of former MP kalpanadevi

వరంగల్ మాజీ ఎంపీ టి.కల్పనాదేవి గుండెపోటుతో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. హన్మకొండలో స్థిరపడిన కల్పనాదేవి 1983లోటీడీపీలో చేరారు. 1984లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి ఐదేళ్ల పాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హన్మకొండలో జయ ఆస్పత్రి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారు కూడా వైద్యులు.  కాగా, కల్పనాదేవి మృతిపట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాపం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement