నిఖిల్ రెడ్డి వ్యవహారంలో గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మను కోరారు.
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి వ్యవహారంలో గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మను కోరారు. గురువారం సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి. కిషన్ రెడ్డిలతో పాటు నిఖిల్‌రెడ్డి తండ్రి రాజీవ్ శర్మను కలిశారు. నిఖిల్‌కి ఎత్తు పెంచుతామంటూ సర్జరీ పేరుతో గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్లు మోకాళ్లలో ఇనుప రాడ్లు వేసిన సంగతి తెల్సిందే. సర్జరీ విఫలమై నిఖిల్‌రెడ్డి ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు.