సాక్షి, చెన్నై: క్రికెటర్ నటరాజన్ పళని ఆలయంలో శనివారం మొక్కులు తీర్చుకున్నారు. గుండు కొట్టుకుని ఆలయంలో పూజలు చేశారు. ఐపీఎల్ ద్వారా తన ప్రతిభ కనబరిచిన తమిళ క్రీడాకారుడు నటరాజన్ ఆస్ట్రేలియా టూర్‌లో తన సత్తా చాటాడు. పర్యటన ముగించుకుని సేలంలోని స్వగ్రామానికి చేరుకున్న నటరాజన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతమే పలికారు. శనివారం దిండుగల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామిని నటరాజన్ దర్శించుకున్నారు. క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలి వచ్చి సెల్ఫీలు దిగారు.
మొక్కు తీర్చుకున్న క్రికెటర్ నటరాజన్
Published Sun, Jan 31 2021 7:11 AM | Last Updated on Sun, Jan 31 2021 4:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment