సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్‌బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు.
పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్‌లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు.
అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పితృత్వ సెలవు మంజూరు కాగా నటరాజన్ మాత్రం తన ముద్దుల పాపాయిని చూసేందుకు మూడునెలలు ఆగాల్సి వస్తోంది. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యంతో పాటు పలువురు నటరాజన్‌ను అభినందనలు ముంచెత్తారు. కాగా భుజం గాయం కారణంగా చాన్స్ మిస్ అయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో నటరాజన్ భారత టీ 2020 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!)
Comments
Please login to add a commentAdd a comment