
ఎన్‌క్కిట్ట మోదాదేలో నట్టి
చాయాగ్రాహకుడిగా దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ప్రాచుర్యం పొందిన నటరాజన్(నట్టి) కోలీవుడ్‌లో కథానాయకుడిగాను మంచి పేరు తెచుకున్నారు. ముఖ్యంగా చతురంగ వేటై చిత్రం ఆయన్ని విజయవంతమైన హీరోగా నిలబెట్టింది.తాజాగా నటరాజన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎన్‌క్కిట్ట మోదాదే. మరో కథానాయకుడిగా రాజాజి నటించిన ఈ చిత్రంలో నటి సంచితాశె శెట్టి, పార్వతీనాయర్ కథానారుుకలుగా నటించారు. దర్శకుడు పాండిరాజ్ శిష్యుడు రాము చెల్లప్పా తొలిసారిగా మోగాఫోన్ పట్టిన ఈ చిత్రానికి నటరాజన్ శంకర్ సంగీతాన్ని అందించారు.ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఎన్‌క్కిట్ట మోదాదే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
చిత్ర ఆడియోను దర్శకుడు పాండిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నటరాజన్ మాట్లాడుతూ దర్శకుడు రాము చెల్లప్పా చెప్పిన కథ చాలా నచ్చేసిందన్నారు.ఇది 1980 ప్రాంతంలో జరిగే కథా చిత్రం అని తెలిపారు.సినీ బ్యానర్లు గీచే కళాకారులు నేపథ్యంలో సాగే కథ ఇదని చెప్పారు. వారి వెనుక ఇంత రాజకీయం ఉంటుందా?అన్నది దర్శకుడు చెప్పిన తరువాతే తనకు తెలిసిందన్నారు.రజనీకాంత్ వీరాభిమానినైన తాను బ్యానర్ ఆర్టిస్టుగా నటించానని తెలిపారు.చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారని తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు పిచ్చైక్కారన్, ఇరైవి, కుట్రమే దండణై చిత్రాలను విడుదల చేసిన కేఆర్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కుల్ని పొందింది.చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.