
Photo Courtesy: Twitter
చెన్నై: ఇటీవల మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమైన టీమిండియా పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి. నటరాజన్‌కు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. ఈ విషయాన్ని నటరాజన్ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ‘ ఈరోజు(ఏప్రిల్ 27వ తేదీ) నా మోకాలి సర్జరీ విజయవంతమైంది. నా సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్ టీమ్, సర్జన్స్, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కుకు కృజజ్ఞతలు. ఇక నా సర్జరీ విజయవంతం కావాలని విష్ చేసిన బీసీసీఐకి కూడా ధన్యవాదాలు’ అని తెలిపాడు.
దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘నటరాజన్ నువ్వు త్వరగా కోలుకోవాలి. మళ్లీ ఫీల్డ్‌లో చూడాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేసింది. టోర్నీలో మోకాలి గాయంతో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ గాయం తీవ్రం కావడంతో ఏకంగా టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. సర్జరీ అవసరమని తేలడంతో నటరాజన్ తప్పుకున్నాడు. ఇప్పుడు సర్జరీ చేయించుకున్న నటరాజన్‌కు సుదీర్ఘ విశ్రాంతి అవసరం కానంది.
ఇక్కడ చదవండి: మాకు చార‍్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి
ఐపీఎల్ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం
Wish you a speedy recovery @Natarajan_91. We want to see you back on the field soon. 💪🏾 https://t.co/dPjCxu5baS
— BCCI (@BCCI) April 27, 2021