వచ్చే సీజన్‌లో​ ఎస్‌ఆర్‌హెచ్‌కే ఆడాలని ఉంది.. కానీ | David Warner Says Love To Play SRH 2022 IPL Season But Time Will Tell | Sakshi
Sakshi News home page

David Warner: వచ్చే సీజన్‌లో​ ఎస్‌ఆర్‌హెచ్‌కే ఆడాలని ఉంది.. కానీ

Published Tue, Oct 12 2021 6:15 PM | Last Updated on Tue, Oct 12 2021 6:49 PM

David Warner Says Love To Play SRH 2022 IPL Season But Time Will Tell - Sakshi

Courtesy: IPL Twitter

David Warner Intrested Play For SRH IPL 2022.. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడంపై కన్సల్టింగ్‌ ఎడిటర్‌ బోరియా మజుందార్‌ స్పందించాడు. ఐపీఎల్‌ 2022లో వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌కే ఆడాలని ఉంది.. కానీ టైం ఎప్పుడు ఏం నిర్ణయిస్తుందో చెప్పలేమని తెలిపాడు. అయితే వచ్చే సీజన్‌లో ఏ జట్టుకు ఆడే దానిపై వార్నర్‌ చేతుల్లో ఏం ఉండదని.. అతని కోసం వచ్చే సీజన్‌లో రెండు కొత్త జట్లతో పాటు ఇప్పుడున్న జట్లు కూడా వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నాడు. కాగా వార్నర్‌ ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో తుది జట్టులో అవకాశం రాకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ డగౌట్‌లో ఉండలేకపోయాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన మ్యాచ్‌లకు ప్రేక్షకుడిగా హాజరై ఫ్లాగ్‌ను ఊపుతూ జట్టును ఉత్సాహపరిచాడు.

చదవండి: IPL 2021: ఐపీఎల్‌ రేటింగ్స్‌.. బీసీసీఐకి బ్యాడ్‌న్యూస్‌

ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి అంచె పోటీల్లో కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడన్న కారణంతో వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి కేన్‌ విలియమ్సన్‌కు కెప్టెన్సీ అ‍ప్పగించారు. అయినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ మొత్తం దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ 14 మ్యాచ్‌ల్లో​ 3 విజయాలు.. 11 ఓటములతో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక 2014లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులోకి వచ్చిన వార్నర్‌ తన తొలి సీజన్‌లోనే ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వార్నర్‌ 2016 ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఇక వార్నర్‌ ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌ల్లో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు.. 50 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

చదవండి: 'ప్లీజ్‌ అన్న.. ఎస్‌ఆర్‌హెచ్‌లోనే ఉండవా'.. వార్నర్‌ ఫన్నీ రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement