ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఎస్‌ఆర్‌హెచ్ డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతోపాటు ఎస్‌ఆర్‌హెచ్ రాజస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ వార్నర్‌ను పక్కకు తప్పించడం ఇంకా పెద్ద వివాదానికి దారి తీసింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు టైటిల్ అందించిన వ్యక్తికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగలడంతో బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ విషయం అక్కడితో ఆగిపోయింది.
తాజాగా సునీల్ గావస్కర్ వార్నర్‌ను తప్పించడంపై ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గావస్కర్ మాట్లాడుతూ.. '' ఐపీఎల్ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ రాణించలేదనే కారణంతో వార్నర్‌ను దోషిని చేస్తూ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. దీనిపై ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌కు ఒక ప్రశ్న వేస్తున్నా.. జట్టును సరైన దిశలో నడపలేకపోయాడని.. ఓటములకు అతన్ని బాధ్యత చేస్తూ సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ పదవి నుంచి తప్పించారు.. మరి ఇదే అంశం కోచ్‌లకు వర్తించదా.. జట్టుకు కెప్టెన్ ఎంత ముఖ్యమో.. కోచ్ కూడా అంతే ముఖ్యం. కోచ్ ఆటలో బరిలోకి దిగకపోవచ్చు.. కానీ అతనిచ్చే సలహాలు ఆటగాళ్లకు ఉపయోగపడుతాయి.. వార్నర్ కూడా కోచ్ సలహాలు విన్నాడేమో.. అతను విఫలమైతే కెప్టెన్సీ నుంచి తప్పించారు.. మరి సలహాలు చెప్పిన కోచ్‌ను కూడా తొలగించాలి కదా? అంటూ'' ప్రశ్నించారు.
''వార్నర్ ఈ సీజన్‌లో కెప్టెన్‌గా విఫలమయ్యాడేమో.. ఆటగాడిగా మాత్రం కాదు. గత సీజన్లతో పోలిస్తే అతనిలో వేగం తగ్గిందేమో.. కానీ పరిస్థితులకు తగ్గట్లే ఆడాడు. అతను చేసిన పరుగులు తక్కువ కావొచ్చు.. కానీ అవే ఆ జట్టు కాస్త పోరాడేందుకు అవకాశం ఇచ్చింది. అయినా ఇన్ని సీజన్ల పాటు కెప్టెన్‌గా అతన్ని నమ్మిన ఎస్‌ఆర్‌హెచ్ ఇలా తొందరపాటు నిర్ణయంతో తన ప్రతిష్టను దిగజార్చుకుంది. ఈ దెబ్బతో వార్నర్ మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడుతాడని మాత్రం నేననుకోవడం లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక వార్నర్ ఐపీఎల్ కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన వాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను నాయకత్వం వహించిన నాలుగు సీజన్లలో ఒకసారి టైటిల్ గెలవడంతో పాటు మిగతా మూడుసార్లు కనీసం ఫ్లేఆఫ్‌కు చేర్చాడు. ఇక బ్యాట్స్‌మన్‌గాను వార్నర్ అద్బుత ప్రతిభ కనబరిచాడు. 2014 నుంచి చూసుకుంటే వార్నర్ ప్రతీ సీజన్‌లోనూ 500 పరుగులకు పైగా సాధించడం విశేషం. ఇక 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర వహించిన వార్నర్ ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 848 పరుగులు సాధించి ఒంటి చేత్తో టైటిల్‌ను అందించాడు.
చదవండి: వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు
Comments
Please login to add a commentAdd a comment