వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు | IPL 2021: Fans Trolls And Memes On SRH Removed Warner From Capitancy | Sakshi
Sakshi News home page

వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు

Published Sat, May 1 2021 6:20 PM | Last Updated on Sun, May 2 2021 2:06 AM

IPL 2021: Fans Trolls And Memes On SRH Removed Warner From Capitancy - Sakshi

Courtesy: IPL Twitter

ఢిల్లీ: కెప్టెన్సీ మార్పుపై ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక  చేస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.

''ఐదు సీజన్ల పాటు జట్టును విజయవంతంగా నడిపిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా.. విలియమ్సన్‌ అంటే మాకు గౌరవం.. కానీ వార్నర్‌ స్థానంలో విలియమ్సన్‌ను కెప్టెన్‌ను చేయడం నచ్చలే.. షేమ్‌ ఆన్‌ యువర్‌ డెసిషన్‌  ఎస్‌ఆర్‌హెచ్‌.. వార్నర్‌కు ఇంత అవమానమా.. ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ వార్నర్‌ను వెన్నుపోటు పొడిచింది.. ఈ కుట్ర కోచ్‌ లక్ష్మణ్‌.. టామ్‌మూడీ పర్యవేక్షణలో జరిగింది ''అంటూ కామెంట్లతో రెచ్చిపోవడంతో పాటు మీమ్స్‌ క్రియేట్‌ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ ట్రెండింగ్‌ లిస్టులో చేరిపోయింది.

Courtesy: IPL Twitter
ఇక వార్నర్‌ స్థానంలో విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ నేడు ట్విటర్‌లో పేర్కొంది. దానికి గల కారణాన్ని ప్రెస్‌నోట్‌ రూపంలో రాసి ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''ఇన్నేళ్లుగా కెప్టెన్‌గా  జట్టును నడిపించిన వార్నర్‌కు మా  కృతజ్థతలు. కెప్టెన్‌ పదవి నుంచి తీసేసినంత మాత్రాన వార్నర్‌పై ఉన్న గౌరవం ఎన్నటికీ పోదు. అతను జట్టుకు టైటిల్‌ అందించిన కెప్టెన్‌.. విలియమ్సన్‌ కెప్టెన్సీలో అతను ఇంకా బాగా రాణించాలని.. ఆన్‌ఫీల్డ్‌ లేదా ఆఫ్‌ఫీల్డ్‌ ఏదైనా కావొచ్చు .. నీ సలహాలు ఎప్పుడు మాకు అవసరం'' అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ పేర్కొనడం కొసమెరుపు. 


Courtesy: IPL Twitter
ఇక ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కాగా  రేపు ఢిల్లీ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.ఇక వార్నర్‌ ఐపీఎల్‌ కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన వాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను నాయకత్వం వహించిన ఐదు సీజన్లలో ఒకసారి టైటిల్‌ గెలవడంతో పాటు మిగతా నాలుగుసార్లు కనీసం ఫ్లేఆఫ్‌కు చేర్చాడు. ఇక బ్యాట్స్‌మన్‌గాను వార్నర్‌ అద్బుత ప్రతిభ కనబరిచాడు. 2014 నుంచి చూసుకుంటే వార్నర్‌ ప్రతీ సీజన్‌లోనూ 500 పరుగులకు పైగా సాధించడం విశేషం. ఇక 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర వహించిన వార్నర్‌ ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 848 పరుగులు సాధించి ఒంటి చేత్తో టైటిల్‌ను అందించాడు.  
చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా విలియమ్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement