ప్రాణాపాయ స్థితిలో శశికళ భర్త | VK Sasikala's husband admitted to hospital with multiple organ failure | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయ స్థితిలో శశికళ భర్త

Published Mon, Sep 11 2017 8:21 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

ప్రాణాపాయ స్థితిలో శశికళ భర్త

ప్రాణాపాయ స్థితిలో శశికళ భర్త

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీ వీకే శశికళ భర్త ఎం నటరాజన్‌ తీవ్ర అస్వస్థతో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో చేరారు. మల్టిపుల్‌ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌ కారణంగా ఆయన్ను పెరుంబక్కంలోని గ్లోబల్‌ హెల్త్‌ సిటీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

నటరాజన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేశాయి. గత ఆర్నెల్లుగా నటరాజన్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాయి. వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో లివర్‌, కిడ్నీ ఫెయిలైనట్లు తెలిపాయి. ఊపిరితిత్తులపై కూడా వ్యాధి ప్రభావం ఉండటంతో ఆయన శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందిపడుతున్నట్లు తెలిసింది. నటరాజన్‌కు డయాలసిస్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం ఎనిమిది గంటల పాటు డయాలసిస్‌ కొనసాగింది.

నటరాజన్‌ ఆరోగ్య పరిస్థితిని లివర్‌ స్పెషలిస్టులతో కూడిన టీమ్‌ పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్‌లో వివరించింది. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు నటరాజన్‌ గతంలోనే తమిళనాడు ఆర్గాన్‌ షేరింగ్‌(టీఎన్‌ఓఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement