చెన్నై: టీమిండియా ఫాస్ట్‌బౌలర్, తమిళనాడు క్రికెటర్ టి. నటరాజన్ కల ఎట్టకేలకు నెరవేరింది. తన పేరిట క్రికెట్ మైదానం నెలకొల్పాన్న ఆశయం తీరింది. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలో నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్‌సీజీ) స్థాపించినట్లు నటరాజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘సకల సౌకర్యాలతో మా గ్రామంలో కొత్త క్రికెట్ గ్రౌండ్... నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్‌సీజీ).. నా కల నెరవేరింది.
గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాను. ఈ ఏడాది డిసెంబరులో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు.. ఆ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్... ఆ టూర్‌లోనే ఏకంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటి వరకు ఒక టెస్టు, రెండు వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లలో నటరాజన్ 13 వికెట్లు పడగొట్టాడు.
కాగా తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు.
పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్‌తోనే ప్రాక్టీసు చేశాడు. జయప్రకాశ్ అనే వ్యక్తి అండతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. మూలాలను మర్చిపోకుండా తనలా పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నాడు.
చదవండి: India Tour of South Africa: దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా.. ఈసారైనా కల నెరవేరేనా?
Happy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️
— Natarajan (@Natarajan_91) December 15, 2021
* #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZ
Comments
Please login to add a commentAdd a comment