
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సేలం(తమిళనాడు): భార్యభర్తల మధ్య గొడవకు బంధువు బలయ్యాడు. వివరాలు.. సేలం గాంధీనగర్ చోలపల్లానికి చెందిన సుబ్రమణి (32) లారీ డ్రైవర్. భార్య జీవిత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జీవిత పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి సుబ్రమణి అత్తారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది.
ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్ లారీతో మామను గుద్దడానికి యత్నించాడు. ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడు జీవా (26)పై లారీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికు లు సుబ్రమణికి దేహశుద్ధి చేశారు. దీంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.