![jail term for Sasikala husband - Sakshi - Sakshi - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/17/Natarajan.jpg.webp?itok=lWsNkxol)
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ కుటుంబానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో ‘చిన్నమ్మ’ కారాగారవాసం అనుభవిస్తుండగా తాజాగా ఆమె భర్తకు కూడా జైలు శిక్ష ఖరారైంది. పన్ను ఎగవేత కేసులో ఆయనను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించగా మద్రాస్ హైకోర్టు సమర్థించింది. టయోటా లెక్సస్ కారు కొనుగోలు చేసినప్పుడు ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు రుజువుకావడంతో ట్రయల్ కోర్టు నటరాజన్‌తో పాటు మరో ముగ్గురికి ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
1994లో కొనుగోలు చేసిన లెక్సస్ కారును 1993 మోడల్‌గా చూపించి పన్ను ఎగవేసినందుకు సీబీఐ, ఈడీ వేర్వేరుగా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేశాయి. అసలైన ఇన్‌వాయిస్‌ను మార్చి రూ. 1.06 కోట్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణయింది. 2010లో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టులో అప్పీలు చేయగా అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment