శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
Published Mon, Feb 6 2017 8:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్‌కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చామని అన్నారు తప్ప.. తదుపరి సమాచారం ఏమీ వెల్లడించలేదు. దాంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి.
ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నటరాజన్ ఆస్పత్రి పాలు కావడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడంతో, ఎమ్మెల్యేలంతా కలిసి తమ శాసనసభా పక్ష నేతగా 62 ఏళ్ల శశికళను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ, తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
Advertisement