breathing problem
-
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!
Patient's Symptoms Of Nasal Obstruction: ఇంతవరకు రోగులకు జరిగిన అరుదైన శస్త్ర చికిత్సలు గురించి విన్నాం. శ్వాస కోస సమస్య అనేది చాలామందికి ఎదురై సమస్య. ఆస్మా వంటి సమస్యలున్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది. కానీ ఇక్కడోక వ్యక్తి తనకి అందరిలానే శ్వాసకోస సమస్య ఉందని డాక్టర్ని సంప్రదించాడు. అయితే ఆ తర్వాత విషయం తెలుసుకుని ఆ వ్యక్తే కాదు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అసలు విషయంలోకెళ్తే..ఇంగ్లాండ్‌కి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అతను శ్వాస సమస్యతో బాధపడుతున్నాని చెప్పడంతో ఆ వ్యక్తికి డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తి నాసికా రంధ్రంలో దంతం పెరుతున్నట్లు తెలుసుకుని డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అతని ముఖకవళికలు సాధారణంగానే ఉన్నాయి కానీ ఈ దంతం ఎలా నాసికా రంధ్రంలో పెరుగుతుందనేది మొదట వారికి అర్థం కాలేదు. అయితే డాక్టర్లు కేసుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్టోపిక్ దంతాలు పెరుగుతున్నట్లు నిర్థారించారు. ఎక్టోపిక్ అంటే అసాధారణంగా పెరగడం. కొంతమందిలో దంతాలు ఎగుడు దిగుడుగా పెరిగినట్లు అతనికి ముక్కు రంధ్రంలోకి చోచ్చుకుపోయి పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఆ దంతం అతని కుడి రంధ్రంలో పెరుగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి ఇంట్రానాసల్ విధానం ద్వారా నోటికి సంబంధించిన ఓటోలారింగోలాజిక్ శస్త్రచికిత్స చేసి నాసికా రంధ్రం నుంచి పంటిని తొలగించారు. ఆ దంతం సుమారు 14 మి.మీటర్ల పొడవు ఉంది. మూడు నెలలు తదనంతరం అతను శ్వాసకోస సమస్య నుంచి బయటపడినట్లు డాక్టర్లు వెల్లడించారు. (చదవండి: ఆకాశంలో ఒక వింత!..అదేంటో అంతు చిక్కని రహస్యం!) -
మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు
సాక్షి, వర్ధన్నపేట: తమ కలల పంటను చూసుకోవాలని ఆ గర్భిణి కలలుకన్నది. ఇంతలోనే కరోనా ఆమెపై పంజా విసిరింది. మహమ్మారిపై ధైర్యంగా పోరాడి బిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన బిడ్డను చూసుకునేలోపే మృత్యుఒడికి చేరుకుంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్–సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికను వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మౌనిక ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈనెల 8న మౌనికకు జ్వరం రావడంతో రెండు రోజులు స్థానిక వైద్యులు ఇచ్చిన మందులు వాడగా జ్వరం తగ్గింది. తిరిగి రెండు రోజులకే మళ్లీ జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందింది. ఈ క్రమంలో ఈనెల 22న మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి, ఆపై 23న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో 24వ తేదీన తిరిగి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అదే రోజు రాత్రి మళ్లీ మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనలతో అంబులెన్సులో తరలించారు. ఎంజీఎంలో వైద్యులు ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేదని, కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పారు. మౌనిక తండ్రి ఆ ప్రయత్నాల్లో ఉండగానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఆ తల్లి ఊపిరి వదిలేసింది. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు ఓ పక్క మౌనిక మృతదేహం.. మరో పక్క ఆమెకు పుట్టిన ఆడ శిశువును ఎత్తుకుని మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనికకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినా బంధువులెవరూ దగ్గరకు రాలేదు. మౌనిక భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన సైతం మృతదేహాన్ని చూసేందుకు సుముఖత చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ స్వగ్రామం కట్య్రాలకు తీసుకెళ్లి మౌనిక అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ప్రాణం తీసిన గప్‌చుప్
భువనేశ్వర్ : ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్‌చుప్ ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్‌చుప్) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్ పరిధి సరఫ్‌గడ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది. స్థానికురాలైన ఫూలమతి కిషాన్ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. -
ప్రాణం పోతుందన్నాపట్టించుకోలేదు
దుబ్బాకటౌన్: ‘ఊపిరి ఆడక ప్రాణం పోతోంది.. ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు త్వరగా రావాలి’అంటూ 108కు ఫోన్ చేసి ఎంత వేడుకున్నా రాకపోవడంతో ఓ వ్యక్తి సకాలంలో వైద్యం అందక మృత్యువాతపడ్డాడు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈ సంఘటన జరిగింది. దుబ్బాకకు చెందిన చీర్లంచ శ్రీనివాసు(56) అనే వ్యక్తి తల్లి లక్ష్మికి ఇటీవలనే కరోనా లక్షణాలు కనబడటంతో ఆమెను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి లక్ష్మి మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని దుబ్బాకకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆమె కరోనాతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వైద్యులు శ్రీనివాసు కుటుంబాన్ని గురువారం హోంక్వారంటైన్లో ఉంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, శుక్రవారం ఉదయం శ్రీనివాసు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటూ కింద పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు ఇరుగు పొరుగు వారిని సాయం చేయాలని కోరినా ఎవరూ ముందుకు రావడానికి సాహసించలేదు. 108కు ఫోన్ చేస్తే ఎంతకూ స్పందించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య సిబ్బందికి సమాచారం అం దించినా వారు కూడా అక్కడికి చేరుకోవడం ఆలస్యం కావడంతో శ్రీనివాసు గంటకుపైగా శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మృతిచెందాడు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే సాయంత్రం శ్రీనివాసు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబీకులకు నెగెటివ్: వైద్యం అందక శ్రీనివాసు మృతిచెందడం.., ఆయన తల్లి మూడు రోజుల క్రితం కరోనాతో మరణించడంతో అప్రమత్తం అయిన వైద్య సిబ్బంది, శ్రీనివాసు కుటుంబీకులు ఏడుగురిని సిద్దిపేటకు తరలించి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. అయితే వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
ఆస్పత్రిలో చేరిన నటి : వెంటిలేటర్‌పై చికిత్స
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి జయంతి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేగాక 24 గంటలపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా జయంతి గత 35 సంవత్సరాల నుంచి అస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. (టీవీ నటుడు సుశీల్ ఆత్మహత్య) ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నటిని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని జయంతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలిపారు. ఇక కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. కాగా తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు. (ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా మనోజ్.. నిజమేనా!) -
ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్
సాక్షి,ముంబై : ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఎడమ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్‌తోపాటు, న్యుమోనియో కూడా ఎటాక్ కావడంతో ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. కాగా లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదును కేంద్రం అందించింది. వీటితోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు. బాలీవుడ్‌కు 1000కి పైగా చిత్రాల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన లతా మంగేష్కర్‌కు తెలుగులో కూడా సంతానం సినిమాలో ‘నిద్దుర పోరా తమ్ముడా ’ అనే పాటను పాడారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను దేశంలోని అత్యున్నత పురస్కారం భారత్ రత్న అవార్డును అందుకున్నారు. మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ‘ పానిపట్’ లో గోపికా బాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న (నవంబరు 10) లతా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పద్మినితోపాటు, చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే. Namaskar. Meri bhaanji Padmini Kolhapure ek bahut acchi kalakar hai aur ab woh Panipat is film mein Gopika bai ka kirdaar nibha rahi hai. Main Padmini ko aashirwad deti hun aur Ashutosh aur unki team ko shubhkaamanayein deti hun. pic.twitter.com/bTZJMUjdYq — Lata Mangeshkar (@mangeshkarlata) November 10, 2019 -
శ్వాస ఆడక రెండు నెలల పసిపాప మృతి
సాక్షి, విజయనగరం : పట్టణంలోని కేఎల్‌పురంలో ఉన్న శిశుగృహాకు చెందిన ఓ ఆడబిడ్డ మంగళవారం మృతి చెందింది. వివారాల్లోకి వెళ్తే...రెండు నెలలు క్రితం ఓ అవివాహిత ఆడబిడ్డకు జన్మనిచ్చి శిశుగృహాకు అప్పగించింది. ఆ బిడ్డకు శిశుగృహా సిబ్బంది దీపిక అని పేరు పెట్టారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో శిశుగృహ సిబ్బంది దీపికకు పాలు పట్టడానికి లేచి చూడగా తీవ్ర ఆయాసంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిపడడం గమనించి మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కేంద్రాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో పాప మృతి చెందింది. దీపిక మృతిని ఐసీడీఎస్ ఏపీడీ శాంతకుమారి ధ్రువీకరించారు.కారా (సెంట్రల్ ఆడప్సన్ రిసోర్స్ అధార్టీ) నిబంధనలు ప్రకారం శిశుగృహాకు చెందిన పిల్లలు మృతి చెందితే ఆ పిల్లలకు పోస్టుమార్టం చేయాలి. దీంతో దీపికకు కూడా శిశుగృహ సిబ్బంది కేంద్రాస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే శిశుగృహలో 11 మంది పిల్లలు ఉన్నారు. వారిలో మంగళవారం ఒక పాప మృతి చెందింది. ఆకాష్ అనే ఐదు నెలల బాలుడు కూడా రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాలుడిని విశాఖ కేజీహెచ్‌లో శిశుగృహ సిబ్బంది చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వలంటర్ అనే మరో ఐదు నెలల బాలుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
విమానంలో 11నెలల శిశువుకు అస్వస్ధత
-
విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతి
సాక్షి, హైదరాబాద్: విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
ఇంతింత కాదయా...ఇంటి కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో, పనిచేసే చోట ఘాటైన వాసనలను పీల్చడం.. పెంపుడు జంతువుల వెంట్రుకలు.. దుప్పట్లు, దిండ్లపై ఉండే దుమ్ము.. మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే పెర్ఫ్యూమ్లు, పుప్పొడి రేణువులు, ధూమపానం.. అంతర్గత కాలుష్యానికి ఇవే ప్రధాన కారణాలట. ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం.. బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే రసాయనాలు కూడా అంతర్గత కాలుష్యానికి కారణమవుతున్నాయట. పారిశ్రామిక, వాహన కాలుష్యంతో పోలిస్తే.. ఇంట్లో వెలువడే కాలుష్యమే శ్వాసనాళాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఆసియా పసిఫిక్ ఆస్తమా ఇన్సైట్ అండ్ మేనేజ్మెంట్ (ఇండియా) సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, నాగపూర్, ముంబై, చండీఘర్, సిమ్లా, గువాహటి, కోల్‌కతా, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, సికింద్రాబాద్ తదితర నగరాల్లో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులపై సర్వే నిర్వహించింది. 85 వేల మంది పురుషులు, 85 వేల మంది మహిళలపై ఈ సర్వే చేసింది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే శ్వాస సంబంధ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. నగరంలో ఇప్పటికే పెద్దల్లో 5–8 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుంటే.. చిన్నారుల్లో 10–12 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. అంతర్గత కాలుష్యానికి ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు తోడవడంతో ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. వీటితోనూ ముక్కుకు ముప్పే.. గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం 11 లక్షల వాహనాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇందులో పదిహేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు నుంచి పది లక్షలు ఉన్నాయి. వీటికి తోడు మరో 40 వేల పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఓజోన్ లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రో గ్రాములకుపైగా నమోదవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు సైతం శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. ఒక కాయిల్.. 90 సిగరెట్లతో సమానం.. దోమల నుంచి రక్షణ కోసం చాలామంది మస్కిటో కాయిల్స్ వాడుతున్నారు. ఒక మస్కిటో కాయిల్ 90 సిగరెట్లు వెదజల్లే పొల్యూషన్‌తో సమానం. ఈ గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మందగిస్తుంది. ఊపిరితిత్తుల జీవితకాలం కూడా తగ్గుతుంది. మస్కిటో కాయిల్స్‌కు బదులు ఫ్యాన్ వాడటం ఉత్తమం. – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి.. సువాసన కోసం వాడే కొన్ని రకాల పెర్ఫ్యూమ్లు, మస్కిటో కాయిల్స్ ఘాటైన వాసన వెదజల్లుతాయి. ఇవి శ్వాస నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధ్యమైనంత వరకు తక్కువ ఘాటు ఉన్న పెర్ఫ్యూమ్లనే వాడాలి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులను ఇంటి బయటే ఉండేలా చూసుకోవాలి. కార్పెట్లు, పరుపులు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్ల నుంచి వెలువడే వాసనలకు దూరంగా ఉండటం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ విజయ్‌కుమార్, శ్వాసకోశ వైద్యనిపుణుడు -
కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత
లక్నో : కేంద్రమంత్రి మేనకా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. యూపీ పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురి కావడంలో పిలిబిత్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మేనకా గాంధీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు సమాచారం. కాగా మేనకా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల ఆస్పత్రిలో చేరిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఏర్పడ్డాయని, దీంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఊపిరాడక.. మృత్యువాత
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి ఇందిరానగర్‌లో వడ్డే తిప్పన్న(47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి శనివారం మృతి చెందినట్లు అతని సోదరుడు అశోక్ తెలిపారు. ఇంటి నుంచి బయటకు బయలుదేరగా.. ఆరగడుగుల లోతు కలిగిన నీటి గుంతలో కాలుజారి పడిపోయినట్లు వివరించారు. ఆ తరువాత ఊపిరి ఆడక మృతి చెందినట్లు చెప్పారు. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్‌కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చామని అన్నారు తప్ప.. తదుపరి సమాచారం ఏమీ వెల్లడించలేదు. దాంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నటరాజన్ ఆస్పత్రి పాలు కావడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడంతో, ఎమ్మెల్యేలంతా కలిసి తమ శాసనసభా పక్ష నేతగా 62 ఏళ్ల శశికళను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ, తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. -
'శేషాద్రి ఆరోగ్యం బాగానే ఉంది'
తిరుమల : డాలర్ శేషాద్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తిరుమల ఆలయ అధికారి చిన్నంగారి రమణ తెలిపారు. డాలర్ శేషాద్రికి గుండెనొప్పి రాలేదని, కేవలం ఆయనకు శ్వాసకోశ సమస్య ఉందని రమణ వివరించారు. శేషాద్రికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలోకు ఆయనను తరలించినట్లు ఆయన తెలిపారు.