కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత | Union Minister Maneka Gandhi admitted to emergency ward of a hospital in Pilibhit | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత

Published Fri, Jun 2 2017 3:14 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత

కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత

లక్నో : కేంద్రమంత్రి మేనకా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. యూపీ పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురి కావడంలో పిలిబిత్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మేనకా గాంధీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు సమాచారం.

కాగా  మేనకా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల ఆస్పత్రిలో చేరిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు.  గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఏర్పడ్డాయని, దీంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement