
ఈ గ్యాంగ్ మాస్ గురూ...
నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్‌గా పలు విజయవంతమైన చిత్రాలు అందించినవేలాయుధం అండ్ బ్రదర్స్‌లో ఒకరి వారసుడు అయిన బాలాజీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. యాషిక పిక్చర్స్ ద్వారా ఇండియాలో సినిమాలు విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ‘బ్లాక్ అండ్ వైట్ ది డాన్ ఆఫ్ అస్సాల్ట్’ను ‘మాస్ గ్యాంగ్’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్‌ను, పోస్టర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. యాషిక పిక్చర్స్ భాగస్వాములు ఆనంద్, నటరాజన్ పాల్గొన్నారు.