పుట్టుమచ్చలు తీయించేసిన ధనుష్
పుట్టుమచ్చలు తీయించేసిన ధనుష్
Published Mon, Mar 27 2017 5:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
చెన్నై: హీరో ధనుష్ కేసును మధురై కోర్టు సోమవారం మరోమారు విచారించింది. గతంలో ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. ధనుష్ తమ బిడ్డే అంటున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు చెబుతున్న పుట్టుమచ్చల ఆనవాళ్లను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ధనుష్ శరీరంపై పుట్టు మచ్చల కోసం పరీక్ష చేయగా.. అవి కనిపించలేదు. దీంతో పుట్టుమచ్చలను తొలగించుకున్నారా? అనే దానిపై వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ వైద్యుల బృందం ధనుష్‌కు పరీక్షలు జరిపి పుట్టు మచ్చలను తొలగించుకున్నారని నిర్ధారించింది. లేజర్ టెక్నాలజీతో పుట్టు మచ్చలు తొలగించుకున్నట్లు సోమవారం కోర్టులో నివేదించింది. వైద్యుల నివేదికపై విచారణ జరిపిన కోర్టు అనంతరం కేసును ఏప్రిల్ 11కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Advertisement
Advertisement