డీఎంహెచ్‌వో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
కర్నూలు: డీఎంహెచ్‌వో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ కర్నూలు డీఎంహెచ్‌వో మీనాక్షి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం మీనాక్షి నివాసంతో పాటు ఆమె బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకోగా.. ఇప్పుడు మీనాక్షి కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆమె అక్రమాస్తులపై దృష్టి సారించారు.