42లో 32 హిట్‌... | Telugu dub of Mohanlal's Oppam to release on February 3 | Sakshi
Sakshi News home page

42లో 32 హిట్‌...

Published Mon, Jan 30 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

42లో 32 హిట్‌...

42లో 32 హిట్‌...

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్ లాల్, ‘బేబి’ మీనాక్షి, విమలారామన్‌ ముఖ్య పాత్రల్లో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒప్పం’. మలయాళంలో హిట్‌ అయిన ఈ చిత్రాన్ని దిలీప్‌కుమార్‌ బొలుగోటి సమర్పణలో ఓవర్‌సీన్‌ నెట్‌వర్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ‘కనుపాప’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా పాటలను ప్రదర్శించారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీనివాస్‌ మూర్తి మాట్లాడుతూ –‘‘మోహన్ లాల్, ప్రియదర్శన్  కాంబినేషన్‌లో 42 సినిమాలు రాగా 32 సినిమాలు మంచి హిట్‌ సాధించాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అంధుడిగా మోహన్ లాల్‌ నటన అద్భుతం. తెలుగు ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చేలా ఉంటుంది. ‘ఒప్పం’ను తెలుగులో విడుదల చేయడంలో నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి సహాయపడ్డారు’’ అని దిలీప్‌కుమార్‌ బొలుగోటి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement