oppam
-
నైన్.. లక్కీ సైన్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లక్‌ని నమ్ముతారు. అది కూడా అంకెల్లో వచ్చే అదృష్టాన్ని మాత్రమే. ఈ సూపర్ స్టార్ 9 అంకెను లక్కీగా ఫీల్ అవుతారట. ఫస్ట్ సినిమా ‘ఆనంద్‘ జూన్ 19న రిలీజ్ అయింది. 29 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. అది కూడా మే 19న. ఇలా తనకు కలిసొచ్చిన అన్నింట్లో 9 ఉండే సరికి 9 అంకెను అదృష్టంగా భావించడం మొదలెట్టారట శివరాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ‘కవచ’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్‌లాల్ చేసిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్. విశేషం ఏంటంటే రీమేక్స్‌లో నటించను అని చెప్పిన ఆయన 15 ఏళ్ల తర్వాత రీమేక్ మూవీ చేయడం విశేషం. -
శివన్న కవచం
మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్‡థ్రిల్లర్ చిత్రం ‘ఒప్పమ్’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కనుపాప’ పేరుతో డబ్ చేశారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలో ‘కవచం’గా రీమేక్ అవుతోంది. కన్నడ స్టార్ శివన్న (శివరాజ్ కుమార్) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో జీవీఆర్ వాసు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇషా కొప్పీకర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత శాండల్‌వుడ్‌లో ఇషాకి ఇది కమ్ బ్యాక్ మూవీ. సుధీర్‌వర్మ దర్శత్వంలో వచ్చిన ‘కేశవ’లో ఆ మధ్య తెలుగులోనూ కనిపించిన విషయం గర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం మలయాళీ బ్యూటీ ‘ఇతీ ఆచార్య’ను తీసుకున్నారు చిత్రబృందం. ‘కన్నడ సూపర్ స్టార్ శివన్న గారితో యాక్ట్ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు ఇతీ. కాలేజ్ గార్ల్ పాత్రలో ఇతీ ఆచార్య కనిపించబోతున్నారు. -
42లో 32 హిట్...
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, ‘బేబి’ మీనాక్షి, విమలారామన్ ముఖ్య పాత్రల్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒప్పం’. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని దిలీప్‌కుమార్ బొలుగోటి సమర్పణలో ఓవర్సీన్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘కనుపాప’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా పాటలను ప్రదర్శించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ –‘‘మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో 42 సినిమాలు రాగా 32 సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అంధుడిగా మోహన్ లాల్ నటన అద్భుతం. తెలుగు ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చేలా ఉంటుంది. ‘ఒప్పం’ను తెలుగులో విడుదల చేయడంలో నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి సహాయపడ్డారు’’ అని దిలీప్‌కుమార్ బొలుగోటి చెప్పారు. -
చూపు లేకపోయినా...
ఓ అంధుడు లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అపార్ట్మెంట్లో హత్య జరుగుతుంది. ఆ హంతకుణ్ణి అంధుడు ఎలా పట్టుకున్నాడనే కథతో రూపొందిన సినిమా ‘ఒప్పం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ‘కనుపాప’గా దిలీప్‌కుమార్ బొలుగోటి సమర్పణలో మోహన్ లాల్ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 25న ఆడియో, ఫిబ్రవరి 3న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అంధుడిగా మోహన్‌లాల్ నటన అద్భుతం. అంధుడు హంతకుణ్ణి పట్టుకునే సన్నివేశాలు ఆసక్తికరం’’ అన్నారు దిలీప్‌కుమార్. -
అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్
ఇటీవల కాలంలో సౌత్‌లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయటం కామన్ అయిపోయింది. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇండస్ట్రింగ్ లైన్స్‌తో తెరకెక్కిన సౌత్ సినిమాలు బాలీవుడ్ సినీ జనాలను కూడా అలరిస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలు కూడా సౌత్ రీమేక్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒప్పం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మలయాళంలో దర్శకత్వంలో వహించిన ప్రియదర్శన్ డైరెక్షన్లో బాలీవుడ్ లోనూ రీమేక్ చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా అక్షయ్ స్థానంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఒప్పం బాలీవుడ్ రీమేక్‌పై అధికారిక ప్రకటన రానుంది. -
ఇక 50 కోట్ల సిన్మాతో!
ఈ ఏడాది రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’లతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తెలుగు తెరపై సందడి చేశారు. మలయాళంలో తొలి 100 కోట్ల వసూల్ సినిమా ‘పులి మురుగన్’ డబ్బింగ్ ‘మన్యం పులి’తో మరో హిట్‌ను ఈ నెల మొదట్లో ఖాతాలో వేసుకున్నారు. ఈ నెలలోనే మరో సినిమాతో రెడీ అంటున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పమ్’. మోహన్‌లాల్ సమర్పణలోనే ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బి.దిలీప్‌కుమార్ ‘కనుపాప’గా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘అపార్ట్మెంట్లో జరిగిన ఓ హత్య కేసును లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసే ఓ అంధుడు ఎలా పరిష్కరించాడు, హంతకుణ్ణి ఎలా పట్టుకున్నా డనేది కథ. అంధుడిగా మోహన్‌లాల్ అద్భుత నటన కనబరిచారు. త్వరలో పాటల్ని, నెలా ఖరున చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మలయాళంలో 50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. -
మరోసారి సొంత గొంతుతో..!
ప్రస్తుతం దక్షిణాది నటులందరూ తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ సినిమాలను ఒకే సమయంలో రెండు భాషల్లో రిలీజ్ చేస్తుంటే సీనియర్ హీరోలు కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయకపోయినా.. తమ మాతృభాషలో సక్సెస్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో విజయాలు సాధిస్తుండగా, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మోహన్ లాల్, ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాలతో కూడా అలరించాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం మన్యంపులితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో తన మరో హిట్ సినిమా ఒప్పంను తెలుగు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో మనమంతా సినిమాకు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న మోహన్ లాల్, ఒప్పం డబ్బింగ్ వర్షన్లో మరోసారి తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించాలని నిర్ణయించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు భారీ ఆఫర్లు వచ్చాయి. సౌత్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తున్న మోహన్ లాల్.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు ఈ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. -
అంధుడి పాత్రలో మన్మథుడు..?
సీనియర్ హీరోలు ఇమేజ్ను పక్కన పెట్టి ప్రయోగాలకు సిద్ధమవుతుండటంతో ఇతర భాషల్లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రాల రీమేక్‌లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే దృశ్యం, ఊపిరి లాంటి సినిమాలు ఇదే బాటలో తెరకెక్కి ఘనవిజయాలు సాధించాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఈ లిస్ట్ చేరబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఒప్పం సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంధుడైన ఓ లిఫ్ట్ ఆపరేటర్, ఓ హత్యకేసు నిందితుణ్ని ఎలా పట్టుకున్నాడు అన్నదే సినిమా కథ. మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కింగ్ నాగార్జున హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగ్ ఆ తరువాత ఒప్పం రీమేక్‌లో నటించే అవకాశం ఉంది. ఇటీవల ఊపిరి సినిమాలో వీల్ చైర్‌కే పరిచయం అయిన పాత్రలో కనిపించిన నాగ్.. అంధుడి పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇదే సినిమాను బాలీవుడ్ అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
తెలుగు తెరకు ‘ఒప్పమ్’
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అంధుడిగా నటించిన చిత్రం ‘ఒప్పమ్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రీమేక్, డబ్బింగ్ హక్కుల్ని ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత బి.దిలీప్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘అంధుడైన హీరో ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్. ఓ రోజు ఆ అపార్ట్మెంట్లో హత్య జరుగుతుంది. తప్పించుకున్న ఆ హంతకుణ్ణి హీరో ఎలా పట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ‘ఒప్పమ్’ రూపొందింది. విడుదలైన మూడు వారాల్లో 27కోట్లు వసూలు చేసింది’’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయాలా లేక రీమేక్ చేయాలా? అనే విషయం గురించి నిర్మాత ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. -
ఒప్పమ్ రీమేక్ రైట్స్ ‘ఓవర్ సీస్’కే
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి... దృశ్యం, ప్రేమమ్ చిత్రాల కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. మలయాళ ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న ఒప్పమ్ కథ ఏమిటంటే....ఈ చిత్రంలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించారు. అయితే గుడ్డివాడైన మోహన్ లాల్ ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్మెంట్లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన కిల్లర్ తప్పించుకుంటాడు. అయితే....మర్డర్ చేసిన కిల్లర్‌ను గుడ్డివాడైన మోహన్ లాల్ ఎలా పట్టుకున్నాడు అనేది ఒప్పమ్ కథ. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ పాయింట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొంత మంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే...ఒప్పమ్ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో పాటు రీమేక్ రైట్స్ ను ఓవర్ సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఓవర్ సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ అధినేత బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ అందిస్తుండడం విశేషం. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో ఒప్పమ్ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన మోహన్ లాల్ ఒప్పమ్ తో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే...ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తారా..? లేక రీమేక్ చేస్తారా అనేది త్వరలో తెలియచేయనున్నారు. -
ఇక్కడ కమల్... అక్కడ అక్షయ్‌కుమార్?
ఒప్పమ్... తెలుగులో ఎక్కడా ఇలాంటి పదం విన్నట్లు లేదే అనుకుంటున్నారు కదూ. ఇది మలయాళ పదం. అంటే... కలిసి ఉండటం అని అర్థం. ఇటీవల మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ఇది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం తమిళ పరిశ్రమవారినీ ఆకట్టుకుంది. ఆ నోటా ఈ నోటా ఈ సినిమా గురించి విని, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ఒప్పమ్’ని చూశారు. చిత్రబృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత కమల్‌హాసన్ కూడా ఈ చిత్రాన్ని తిలకించారు. ఫుల్‌గా ఇంప్రెస్ అయ్యారట. ఆ మధ్య ప్రమాదానికి గురై, ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్నారు కమల్. ఈ కారణంగా ఆయన నటించి, దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రం షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది. నవంబర్‌లో పునః ప్రారంభించనున్నారు. ఈలోపు ఇంట్లో స్క్రిప్ట్‌లు గురించి ఆలోచించడంతో పాటు సినిమాలు కూడా చూస్తున్నారాయన. ‘ఒప్పమ్’ కథ, అందులో మోహన్‌లాల్ చేసిన అంధుడి పాత్ర బాగా నచ్చి, ఈ చిత్రం తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు-నటుడు సముద్రఖని నర్మగర్భంగా బయటపెట్టారు. మలయాళ ‘ఒప్పమ్’లో ఆయన విలన్‌గా నటించారు. ‘‘ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌గారు నటిస్తారని విన్నాను. చాలా సంతోషం’’ అని సముద్రఖని పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రలు పోషించే కమల్ అంధుడిగా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు ‘రాజ పార్వై’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్ నటన అద్భుతం. ‘రాజ పార్వై’ విడుదలై 35 ఏళ్లయింది. కమల్ నటనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదు. సో.. ‘ఒప్పమ్’లో అంధుడిగా జీవిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్షయ్ దృష్టి కూడా... రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘2.0’లో ప్రతినాయకుడిగా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్‌కుమార్ దృష్టి కూడా ‘ఒప్పమ్’పై పడిందట. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఆయన దక్కించుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కీ, అక్షయ్కీ మధ్య మంచి స్నేహం ఉంది. అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘హేరా ఫేరీ’, ‘గరమ్ మసాలా’, ‘భాగమ్ భాగ్’, ‘భూల్ భులయ్యా’, ‘కట్టా మీఠా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రియదర్శన్. ఒకవేళ అక్షయ్ చేస్తే.. హిందీ వెర్షన్‌కి కూడా ప్రియదర్శనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని వినికిడి.