శివన్న కవచం | Shivarajkumar to hunt for murderer in Oppam remake | Sakshi
Sakshi News home page

శివన్న కవచం

Published Sun, Dec 24 2017 1:00 AM | Last Updated on Sun, Dec 24 2017 8:25 AM

 Shivarajkumar to hunt for murderer in Oppam remake - Sakshi

మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్‌ హిట్‌ క్రైమ్‌‡థ్రిల్లర్‌ చిత్రం ‘ఒప్పమ్‌’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కనుపాప’ పేరుతో డబ్‌ చేశారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలో ‘కవచం’గా రీమేక్‌ అవుతోంది. కన్నడ స్టార్‌ శివన్న (శివరాజ్‌ కుమార్‌) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో జీవీఆర్‌ వాసు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇషా కొప్పీకర్‌ పోలీస్‌ పాత్ర చేస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత శాండల్‌వుడ్‌లో ఇషాకి ఇది కమ్‌ బ్యాక్‌ మూవీ. సుధీర్‌వర్మ దర్శత్వంలో వచ్చిన ‘కేశవ’లో ఆ మధ్య తెలుగులోనూ కనిపించిన విషయం గర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం మలయాళీ బ్యూటీ ‘ఇతీ ఆచార్య’ను తీసుకున్నారు చిత్రబృందం. ‘కన్నడ సూపర్‌ స్టార్‌ శివన్న గారితో యాక్ట్‌ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు ఇతీ. కాలేజ్‌ గార్ల్‌ పాత్రలో ఇతీ ఆచార్య కనిపించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement