ఇక 50 కోట్ల సిన్మాతో! | mohanlal new movie kanupapa | Sakshi
Sakshi News home page

ఇక 50 కోట్ల సిన్మాతో!

Published Fri, Dec 9 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

ఇక 50 కోట్ల సిన్మాతో!

ఇక 50 కోట్ల సిన్మాతో!

ఈ ఏడాది రెండు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్‌’లతో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తెలుగు తెరపై సందడి చేశారు. మలయాళంలో తొలి 100 కోట్ల వసూల్‌ సినిమా ‘పులి మురుగన్‌’ డబ్బింగ్‌ ‘మన్యం పులి’తో మరో హిట్‌ను ఈ నెల మొదట్లో ఖాతాలో వేసుకున్నారు. ఈ నెలలోనే మరో సినిమాతో  రెడీ అంటున్నారు. మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఒప్పమ్‌’. మోహన్‌లాల్‌ సమర్పణలోనే ఓవర్‌సీస్‌ నెట్‌వర్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.దిలీప్‌కుమార్‌ ‘కనుపాప’గా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.

దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ హత్య కేసును లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేసే ఓ అంధుడు ఎలా పరిష్కరించాడు, హంతకుణ్ణి ఎలా పట్టుకున్నా డనేది కథ. అంధుడిగా మోహన్‌లాల్‌ అద్భుత నటన కనబరిచారు. త్వరలో పాటల్ని, నెలా ఖరున చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. మలయాళంలో 50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement