kanupapa
-
శివన్న కవచం
మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్‡థ్రిల్లర్ చిత్రం ‘ఒప్పమ్’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కనుపాప’ పేరుతో డబ్ చేశారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలో ‘కవచం’గా రీమేక్ అవుతోంది. కన్నడ స్టార్ శివన్న (శివరాజ్ కుమార్) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో జీవీఆర్ వాసు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇషా కొప్పీకర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత శాండల్‌వుడ్‌లో ఇషాకి ఇది కమ్ బ్యాక్ మూవీ. సుధీర్‌వర్మ దర్శత్వంలో వచ్చిన ‘కేశవ’లో ఆ మధ్య తెలుగులోనూ కనిపించిన విషయం గర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం మలయాళీ బ్యూటీ ‘ఇతీ ఆచార్య’ను తీసుకున్నారు చిత్రబృందం. ‘కన్నడ సూపర్ స్టార్ శివన్న గారితో యాక్ట్ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు ఇతీ. కాలేజ్ గార్ల్ పాత్రలో ఇతీ ఆచార్య కనిపించబోతున్నారు. -
అభిమాని కోసం సూపర్ స్టార్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించటమే కాదు, మాలీవుడ్ లో 50 కోట్ల, 100 కోట్ల రికార్డ్ లను కూడా సాధ్యం చేసి చూపించాడు మోహన్ లాల్. స్టార్ గా ఎంత ఎదిగిన తన అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ కంప్లీట్ యాక్టర్ తాజా అభిమాని కల నేరవేర్చేందుకు స్వయంగా పూనున్నాడు. ఎక్కడ ఒక వీడియోలో ఓ పెద్దావిడ తనను కలవాలనుందని తెలపడంతో ఆమెను కలిసేందుకు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఆ పెద్దావిడను కలిసి మోహన్ లాల్ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పొస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. -
'కనుపాప' మూవీ రివ్యూ
టైటిల్ : కనుపాప జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : మోహన్ లాల్, సముద్రఖని, అనుశ్రీ, బేబీ మీనాక్షి, నెడుముడి వేణు సంగీతం : రోన్ ఎతన్ యోహన్ దర్శకత్వం : ప్రియదర్శన్ నిర్మాత : మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్‌గా ఉన్న మోహన్ లాల్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ మార్కెట్ల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కంప్లీట్ యాక్టర్ ఇప్పుడు తన ఇతర చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటలో గత ఏడాది మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒప్పం సినిమాను కనుపాప పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మాలీవుడ్‌లో 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? కథ : గుడ్డివాడైన జయరామ్ (మోహన్ లాల్).. తన ఊరికి దగ్గర్లో ఉన్న సిటీలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. తన సంపాదనతోనే చెల్లికి ఘనంగా పెళ్లిచేసేందుకు కష్టపడుతుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లో ఉండే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కృష్ణమూర్తికి (నెడుముడి వేణు) చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంటాడు. కంటిచూపు లేకపోయినా.. శబ్దాల ద్వారా, వాసనల ద్వారా కంటిచూపు ఉన్న వారికంటే బాగా అన్ని పనులు చేసుకోవటంతో పాటు వ్యక్తులను గుర్తించగలుగుతాడు. అయితే జయరామ్‌కు ఈ శక్తి వల్ల అతను గుడ్డివాడుగా నటిస్తున్నాడన్న అనుమానం కూడా కొందరికి కలుగుతుంది. కృష్ణమూర్తి ఎవరికీ తెలియకుండా నందిని(మీనాక్షి) అనే అమ్మాయిని ఊటిలో ఉంచి చదివిస్తుంటాడు. అదే సమయంలో వాసుదేవ్(సముద్రఖని) అనే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఈ ప్రయత్నం కొనసాగుతుండగానే కృష్ణమూర్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం జయరామ్ మీద పడుతుంది. ఇంతకీ కృష్ణమూర్తిని ఎవరు చంపారు..? కృష్ణమూర్తి దూరంగా ఉంచి పెంచుతున్న అమ్మాయి ఎవరు..? కృష్ణమూర్తి వెతుకుతున్న వాసుదేవ్ ఎవరు.. ? ఈ సమస్యలన్నింటి నుంచి జయరామ్ ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మాలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ హీరోగా కథబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో కంప్లీట్ యాక్టర్ అన్న టైటిల్‌ను సార్థకం చేసుకుంటున్నాడు. కనుపాప సినిమాలో గుడ్డివాడిగా నటించిన మోహన్ లాల్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తన మీద పడ్డ నింద చెరిపేసుకోవటం, అదే సమయంలో ఒక పసి పాప ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఓ గుడ్డివాడు చేసిన పోరాటాన్ని తెర మీద ఆవిష్కరించాడు. సైకో విలన్‌గా సముద్రఖని నటన సూపర్బ్. సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కేవలం తన ఎక్స్ప్రెషన్స్ తోనే విలనిజాన్ని పండించాడు సముద్రఖని. నందిని పాత్రలో నటించిన మీనాక్షి ముద్దు ముద్దు మాటలతో అలరించింది. ఇతర పాత్రల్లో నెడుముడి వేణు, విమలారామన్, అనుశ్రీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : గతంలో మోహన్ లాల్ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రియదర్శన్ మరోసారి అదే రికార్డ్ ను కంటిన్యూ చేస్తూ తెరకెక్కించిన చిత్రం కనుపాప. అయితే ఈ సారి మోహన్ లాల్ నటన మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియదర్శన్, కథనాన్ని మాత్రం కాస్త తీరిగ్గా నడిపించాడు. నటుడిగా మోహన్ లాల్ ను ఎలివేట్ చేసే సీన్స్ లె పర్ఫెక్ట్ గా రాసుకున్న ప్రియదర్శన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్పీడు మాత్రం చూపించలేదు. స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టిన 4 మ్యూజిక్స్ గ్రూప్ ఇచ్చిన సంగీతం, ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫి ఆడియన్స్ ను కదలకుండా కూర్చోపెడతాయి. మోహన్ లాల్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్లస్ పాయింట్స్ : మోహన్ లాల్ నటన సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : తెలుగు నేటివిటి లేకపోవటం స్లో నారేషన్ కనుపాపలో ప్రియదర్శన్ కాస్త తీరిగ్గా కథ నడిపించినా.. మోహన్ లాల్ తన అద్భుత నటనతో అన్ని మైనస్‌లను కవర్ చేశాడు. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
42లో 32 హిట్...
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, ‘బేబి’ మీనాక్షి, విమలారామన్ ముఖ్య పాత్రల్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒప్పం’. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని దిలీప్‌కుమార్ బొలుగోటి సమర్పణలో ఓవర్సీన్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘కనుపాప’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా పాటలను ప్రదర్శించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ –‘‘మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో 42 సినిమాలు రాగా 32 సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అంధుడిగా మోహన్ లాల్ నటన అద్భుతం. తెలుగు ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చేలా ఉంటుంది. ‘ఒప్పం’ను తెలుగులో విడుదల చేయడంలో నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి సహాయపడ్డారు’’ అని దిలీప్‌కుమార్ బొలుగోటి చెప్పారు. -
ఇక 50 కోట్ల సిన్మాతో!
ఈ ఏడాది రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’లతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తెలుగు తెరపై సందడి చేశారు. మలయాళంలో తొలి 100 కోట్ల వసూల్ సినిమా ‘పులి మురుగన్’ డబ్బింగ్ ‘మన్యం పులి’తో మరో హిట్‌ను ఈ నెల మొదట్లో ఖాతాలో వేసుకున్నారు. ఈ నెలలోనే మరో సినిమాతో రెడీ అంటున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పమ్’. మోహన్‌లాల్ సమర్పణలోనే ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బి.దిలీప్‌కుమార్ ‘కనుపాప’గా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘అపార్ట్మెంట్లో జరిగిన ఓ హత్య కేసును లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసే ఓ అంధుడు ఎలా పరిష్కరించాడు, హంతకుణ్ణి ఎలా పట్టుకున్నా డనేది కథ. అంధుడిగా మోహన్‌లాల్ అద్భుత నటన కనబరిచారు. త్వరలో పాటల్ని, నెలా ఖరున చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మలయాళంలో 50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.