తెలుగు తెరకు ‘ఒప్పమ్’ | Mohanlal plays a blind man in oppam movie | Sakshi
Sakshi News home page

తెలుగు తెరకు ‘ఒప్పమ్’

Published Thu, Sep 29 2016 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

తెలుగు తెరకు ‘ఒప్పమ్’ - Sakshi

తెలుగు తెరకు ‘ఒప్పమ్’

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అంధుడిగా నటించిన చిత్రం ‘ఒప్పమ్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రీమేక్, డబ్బింగ్ హక్కుల్ని ఓవర్‌సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత బి.దిలీప్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘అంధుడైన హీరో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఆపరేటర్.
 
 ఓ రోజు ఆ అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. తప్పించుకున్న ఆ హంతకుణ్ణి హీరో ఎలా పట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో  ‘ఒప్పమ్’ రూపొందింది. విడుదలైన మూడు వారాల్లో 27కోట్లు వసూలు చేసింది’’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయాలా లేక రీమేక్ చేయాలా? అనే విషయం గురించి నిర్మాత ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement